Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ పెద్దగా ఫీలవ్వట్లేదు.. ఫ్యాన్సే..

By:  Tupaki Desk   |   19 July 2015 5:10 PM IST
ప్రభాస్‌ పెద్దగా ఫీలవ్వట్లేదు.. ఫ్యాన్సే..
X
''బాహుబలి'' సినిమా రికార్డులను ఎవ్వరు ఎలా క్లయిమ్‌ చేస్తున్నా కూడా.. సినిమా చూసినవారు ఎవ్వరైనా కూడా రాజమౌళి, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ లను సమానంగా పొగిడేస్తున్నారు. ఒక ప్రక్కన ప్రభాస్‌ కు ఎంత పేరొచ్చిందో సినిమాలో మిగిలిన పాత్రలకు కూడా అంతే పేరొచ్చింది. అయితే ఇక్కడే ఒక విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. ఆ ట్‌ ట్‌ సినిమా అంతే మా వాడిదే అంటూ రచ్చ చేస్తున్నారు.. ఇతర ఫ్యాన్స్‌ మాత్రం సినిమా రాజమౌళిది అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. అయితే నిజానికి ఏ సినిమా అయినా కూడా అది దర్శకుడి దే. కథకుడు అతనే కాబట్టి, అతని ఊహనే సినిమా. కాకపోతే అతను అనుకున్న పాత్ర ల్లో ఒక స్టార్‌ చేయడం వలన సినిమా రీచ్‌ పెరుగుతుంది అంతే. ఇదే విషయం సెలవిస్తున్నాడు ప్రభాస్‌.

''బాహుబలి అనేది ఓ పెద్ద కథ. అందులో నేను ఒక భాగం మాత్రమే. సినిమాకు విజువల్‌ ఎఫెక్టు లు కూడా ఒక హీరో. ఈ కథను అలా రాశారు. అంతేకాని నాకే క్రెడిట్‌ దక్కాలంటే ఎలా? ఇది రాజమౌళి క్రియేషన్‌.. ఆయనే క్రెడిట్స్‌ దక్కాలు. ఇప్పుడే ఇలాగంటే.. ఇక రెండో పార్టు లో అనుష్క, రానా ఇంకా ఇరగదీస్తారు. వారిక సీన్లు పవర్‌ ఫుల్‌ గా ఉంటాయి'' అంటూ చెప్పుకొచ్చాడు. సో, ఫ్యాన్సందరూ ప్రభాస్‌ సినిమా అని, ప్రభాస్‌ సినిమా కాదని ఫీలవ్వకుండా దీనిని ఒక ఆణిముత్యంగా చూసుకుంటే బెటర్‌.