Begin typing your search above and press return to search.

అందుకోసం శ్ర‌ద్ధాను తీసుకోలేదు:ప్రభాస్

By:  Tupaki Desk   |   24 Dec 2017 11:24 AM GMT
అందుకోసం శ్ర‌ద్ధాను తీసుకోలేదు:ప్రభాస్
X
'బాహుబలి` సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ కు ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో బాహుబ‌లి పాత్ర‌లో ఒదిగిపోయిన తీరుకు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. దీంతో, ప్ర‌భాస్ న‌టిస్తోన్న త‌ర్వాతి చిత్రం 'సాహో`పై భారీ స్థాయిలో అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న హీరోయిన్ గా ఎవ‌రు న‌టిస్తోన్నార‌న్న దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వచ్చాయి. చివ‌ర‌కు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ....ప్ర‌భాస్ కు జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రధ్దాను ఎంచుకోవ‌డం స‌రైన నిర్ణ‌య‌మ‌ని ప్ర‌భాస్ అన్నాడు. ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా కీల‌క‌మైన‌ద‌ని - పాటలు - డ్యాన్స్ ల‌కోసం తీసుకోలేద‌ని అన్నాడు. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు.

శ్ర‌ద్ధా క‌పూర్ ను ప్ర‌భాస్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. ఈ సినిమాలో ఆమె న‌టించ‌డం త‌మ‌ అదృష్టమ‌ని - యాక్షన్ స‌న్నివేశాల కోసం ఆమె చాలా క‌ష్ట‌ప‌డింద‌న్నాడు. శ్ర‌ద్ధా క‌పూర్ కు యాక్టింగ్ - సినిమాలపై ఉన్న ఆస‌క్తిని చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నాడు. త‌న‌తో న‌టించిన‌ కొంద‌రు హీరోయిన్లు ముందు టాలీవుడ్‌ లో న‌టించి ఆపై బాలీవుడ్ కు వెళ్లార‌ని - కానీ అక్క‌డ పాపుల‌ర్ అయిన త‌ర్వాతే శ్ర‌ద్ధా ఇక్క‌డ న‌టిస్తోంద‌న్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్ లో ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజీత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయ‌ట‌. ట్రాన్స్‌ఫార్మర్ వంటి చిత్రాల‌కు ప‌నిచేసిన కేన్నీ బేట్స్ సాహోలో యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. వచ్చే దీపావళికి 'సాహో' విడుదల అయ్యే అవ‌కాశ‌ముంది. గ్రాఫిక్స్ కు అద‌నంగా స‌మ‌యం ప‌డితే....2019లో సంక్రాంతి కానుక‌గా సాహో ను విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.