Begin typing your search above and press return to search.
రాజమౌళి ‘చాలా కష్టం’ అన్నవేళ..
By: Tupaki Desk | 18 March 2017 12:16 PM IST‘స్టూడెంట్ నెంబర్ వన్’తో మొదలుపెట్టి.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వరకు ప్రతి సినిమాతోనూ ఎన్నో మెట్లూ ఎక్కుతూ వెళ్లాడు రాజమౌళి. తనకు తాను పెద్ద టార్గెట్లు పెట్టుకుని.. వాటిని రీచ్ అవుతూ తన స్థాయిని పెంచుకుంటూ పోయాడు జక్కన్న. మిగతా వాళ్లకు అసాధ్యం అనిపించిన చాలా విషయాల్ని రాజమౌళి అలవోకగా చేసేశాడు. సెట్లో రాజమౌళి తీరు చూస్తే ఏదైనా సాధ్యమే.. ఇదెంత పని అన్నట్లుగా ఉంటుందని అంటారు అతడితో పని చేసిన నటీనటులు.. టెక్నీషియన్లు. ఐతే అన్నీ చాలా తేలిగ్గా చేసేసే రాజమౌళి కూడా ‘బాహుబలి: ది బిగినింగ్’ షూటింగ్ విషయంలో ఒక సన్నివేశం దగ్గర కాన్ఫిడెన్స్ కోల్పోయాడని అంటున్నాడు ప్రభాస్. ఆ సీన్ ఏంటో.. రాజమౌళిని అది ఎంతగా ఇబ్బంది పెట్టిందో ప్రభాస్ మాటల్లో తెలుసుకుందాం పదండి.
‘‘బాహుబలి: ది కంక్లూజన్ విషయంలో అంతా సాఫీగా సాగిపోయింది. ఎందుకంటే ప్రేక్షకులు మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బడ్జెట్ విషయంలోనూ భయం లేకపోయింది. మేం చేసేది ప్రేక్షకులు చూస్తారని మాకు అర్థమైంది. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’ విషయంలో అలా కాదు. మాకే అన్నీ కొత్త. చాలా ఖర్చు పెడుతుండటంతో ఎన్నో భయాలుండేవి. దీనికి తోడు షూటింగ్ సందర్భంగానూ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక రకమైన భయంతో పని చేసేవాళ్లం. అలాంటి టైంలో విగ్రహం లేపే సీన్ దగ్గర చాలా ఇబ్బందైంది. ఆ ఒక్క సీన్ కూడా 8-9 రోజులు పట్టింది. ఏ సీన్ అయినా చాలా కాన్ఫిడెంటుగా కనిపించే రాజమౌళి గారు కూడా నా దగ్గరికి వచ్చి ఇదేంటి ఇంత కష్టంగా ఉంది అన్నారు. నేను రాజమౌళి గారి నుంచి అలాంటి మాట ఎప్పుడూ వినలేదు. దాన్ని బట్టే ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో ఎంత కష్టపడి ఉంటామో అర్థం చేసుకోవచ్చు. ఐతే ఫస్ట్ పార్ట్ కు వచ్చిన స్పందన చూశాక కష్టమంతా కొట్టుకుపోయింది’’ అని ప్రభాస్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/