Begin typing your search above and press return to search.
అంతకుమించి.. అంటున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీ!
By: Tupaki Desk | 20 April 2020 12:00 PM ISTటాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రభాస్ సినిమాకోసం అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో ప్రభాస్ తో చేసే సినిమాలు భారీ బడ్జెట్ లోనే ఉంటున్నాయి. సాహో తర్వాత ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతుంది.
ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆల్రెడీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం చివరలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడట. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ లెవెల్లో ఉంటుంది. అందుకే విఎఫ్ఎక్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టనున్నాడట నిర్మాత అశ్వినీదత్.
పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపొందుతుందనీ, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా బడ్జెట్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' బడ్జెట్ ను మించి వుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' 350 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతోందట. అంతకుమించిన బడ్జెట్ తో ప్రభాస్ మూవీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ను జోడించిన కథ కావడం.. బాలీవుడ్ కి చెందిన ఆర్టిస్టులు ఉండటం.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయడం ఈ స్థాయి బడ్జెట్ కి కారణమని చెప్పుకుంటున్నారు. అధికారికంగా ప్రకటన బయటికి రానప్పటికీ సినీ అభిమానులలో మాత్రం భారీ అంచనాలు నెలకొంటున్నాయి.