Begin typing your search above and press return to search.

వైవిధ్యమైన కొత్త లుక్ లో డార్లింగ్ ప్రభాస్..

By:  Tupaki Desk   |   30 March 2020 10:30 AM GMT
వైవిధ్యమైన కొత్త లుక్ లో డార్లింగ్ ప్రభాస్..
X
డార్లింగ్ ప్రభాస్.. మొదటి నుండి కూడా సినిమా సినిమాకి విభిన్నమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ కొత్త కొత్త స్టైల్ ని పరిచయం చేస్తూ వస్తున్నాడు. అలాగే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, సాహో సినిమాలలో తన హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసారు దర్శకులు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన తదుపరి చిత్రాలన్నీ ఆ లెవెల్ లోనే ఇండియా మొత్తం విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి, సాహో లాంటి భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల తర్వాత డార్లింగ్ ప్రస్తుతం పీరియాడిక్ లవ్ డ్రామా మూవీలో నటిస్తున్నాడు.

జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడట దర్శకుడు. ప్రభాస్ ని ఇంతవరకు చూడని లుక్ లో చూపిస్తానంటూ.. వివిధ రకాల అప్పటి పీరియాడిక్ టైంలో ఉండే లుక్స్ ట్రై చేస్తున్నాడట. 1960లోని గాఢమైన ప్రేమకథ కాబట్టి ఆ ట్రెండ్ కి తగ్గ లుక్స్ డిసైన్ ప్రత్యేకంగా చేస్తున్నారట చిత్రయూనిట్. ప్రభాస్ ఇంతవరకు చూడని వైవిధ్యమైన లుక్, బాడీ లాంగ్వేజ్ లో కనిపిస్తాడట. యూవీ క్రియేషన్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ బాషలలో రిలీజ్ కానుంది. డార్లింగ్ మూవీ గురించి ఏ న్యూస్ దొరికినా అభిమానులలో మాత్రం సందడి మాములుగా ఉండట్లేదు.