Begin typing your search above and press return to search.

ఇంజ‌నీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రులు కాబ‌ట్టే సైన్స్ ఫిక్ష‌న్ ప్ర‌యోగం?

By:  Tupaki Desk   |   25 Jun 2021 6:30 AM GMT
ఇంజ‌నీరింగ్ ప‌ట్ట‌భ‌ద్రులు కాబ‌ట్టే సైన్స్ ఫిక్ష‌న్ ప్ర‌యోగం?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న స్థాయిని అంత‌కంత‌కు పెంచుకుంటున్న తీరు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అత‌డు పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గాను ఎద‌గ‌డానికి అతి స‌మీపంలో ఉన్నారు. ఒక స్ట్రెయిట్ హాలీవుడ్ మూవీ చేసేంత స్థాయి అత‌డికి ఉంది. బాహుబ‌లి - సాహో చిత్రాల‌తో అత‌డు వ‌ర‌ల్డ్ ఆడియెన్ కి చేరువ‌య్యాడు. ప్ర‌భాస్ క్రేజ్ చూసి బాలీవుడ్ ఇండ‌స్ట్రీనే అత‌డిని కావాల‌నుకుంటోంది. ఇది ప్ర‌భాస్ స్టార్ డ‌మ్ కి సింబాలిక్ గా క‌నిపిస్తోంది.

మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ సైన్స్ ఫిక్షన్ ఫాంట‌సీ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ క్రేజ్ రెట్టింపు అవుతుంద‌ని పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ కావ‌డానికి ఈ చిత్రం బీజం వేస్తుంద‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే ఇలాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ అండ్ కో ఇంజ‌నీర్ల‌ను కూడా భాగం చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

టెక్నిక‌ల్ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉండే స్క్రిప్ట్ కావ‌డంతో భారీ ఎత్తున ఇంజ‌నీర్ల‌ను సినిమా కోసం రిక్రూట్ చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కేవ‌లం హైలీ ట్యాలెంటెడ్ గ‌ల ఇంజ‌నీర్ల‌ను మాత్రం జ‌ల్లెడ వేసి ఎంపిక చేయాల‌ని ఈ ద్వ‌యం సిద్దం అవుతున్నారుట‌. డిజైన‌ర్స్- వెహిక‌ల్ డిజైన‌ర్స్- రోబోటిక్స్- ఎల‌క్ట్రిక‌ల్- మెకానిక‌ల్- ఇండ స్ట్రియ‌ల్ - సివిల్ నిర్మాణ‌ రంగాల్లో రాణిస్తున్న వారిని..ఆ రంగంలో క్రియేటివ్ గా థింక్ చేయ‌గ‌ల సామ‌ర్ధ్యం ఉన్న వారిని తీసుకోవాల‌ని ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. అందుకోసం స‌ద‌రు ఇంజ‌నీర్ల‌కు భారీగానే ప్యాకేజ్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారుట‌.

ఏదేమైనా యువ ఇంజ‌నీర్లకు..సినిమాలు.. ఆర్ట్ వ‌ర్క్ పై ఫ్యాష‌న్ ఉన్న వారికి ఇది చ‌క్క‌ని అవ‌కాశం. ప్రొడ‌క్ష‌న్ కంపెనీలు నేరుగా ఇలాంటి రిక్రూట్ మెంట్లు చేప‌ట్ట‌వు. ఏదో ఒక కంపెనీకి టెక్నిక‌ల్ వ‌ర్క్ అప్ప‌గించి చేతులు దులుపుకుంటుంది. కానీ ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్..హీరో ప్ర‌భాస్ ఇంజ‌నీర్ల క‌ష్టాలు తెలిసిన వారు. ఇరువురు ఇంజ‌నీరింగ్ లో ప‌ట్ట‌భ‌ద్రులు. కాబ‌ట్టే యువ ఇంజ‌నీర్ల‌ల‌లో ప్ర‌తిభ‌ను వెలికి తీయ‌డానికి ఇలాంటి అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.. ఎంతో తెలివిగా రిక్రూట్ మెంట్ చేప‌డుతున్న‌ట్టు భావించ‌వ‌చ్చు.