Begin typing your search above and press return to search.

సాహో రాకముందే మరో సినిమా?

By:  Tupaki Desk   |   13 Feb 2018 5:00 AM IST
సాహో రాకముందే మరో సినిమా?
X
స్టార్ హీరోల సినిమాలంటే ఈ రోజుల్లో మినిమమ్ ఏడాది పడుతోంది. ఎంత కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నప్పటికీ ఓ తొమ్మిది నెలల సమయమైనా పడుతోంది. లేట్ గా వచ్చినా మంచి సినిమాతో రావాలని హీరోల ఆలోచన కరక్టే గాని అభిమానులు మాత్రం ఆలస్యం కారణంగా చాలా బాధపడుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం అభిమానులను అలా వెయిట్ చేయించకూడదని మంచి నిర్ణయం తీసుకున్నాడట.

సాహో సినిమా ఈ ఏడాది వచ్చే పరిస్థితుల్లో లేదు. దర్శకుడు సుజీత్ పట్టు వదలకుండా సిన్ అనుకున్నట్టుగా వచ్చే వరకు చిత్ర యూనిట్ ని కాస్త కంగారు పెడుతున్నాడట. దీంతో సమయం ఇంకా ఎక్కువగానే పడుతోందని టాక్ వస్తోంది. అయితే రాబోయే షెడ్యూల్ లో ప్రభాస్ కి అప్పుడపుడు ఖాళీ సమయం దొరుకుతుండడంతో మరొక సినిమా ఫినిష్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట. పెదనాన్న కృష్ణం రాజు కూడా అదే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణ చెప్పిన కథకు ప్రభాస్ సాహో స్టార్ట్ కాకముందే ఒకే చేశాడు. ఆ సినిమా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోందట. దీంతో షూటింగ్ కు ఎక్కువగా సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది. సాహో కంటే ముందే రిలీజ్ చేయాలనీ ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట. కేవలం ఆరు నెలల్లో ఫినిష్ చేసేలా దర్శకుడిని ప్లాన్ వేసుకొమ్మన్నట్లు ప్రభాస్ ఇటీవల చర్చలు జరిపారని సమాచారం.