Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ - మారుతి లతో జాయిన్ అయిన కేజీఎఫ్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   8 Dec 2022 5:04 AM GMT
ప్రభాస్‌ - మారుతి లతో జాయిన్ అయిన కేజీఎఫ్‌ స్టార్‌
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటూ ఉంది. ఇక సలార్‌ మరియు ప్రాజెక్ట్‌ కే సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. అవి కాకుండా ఇటీవలే మారుతి దర్శకత్వంలో సినిమాను కూడా ప్రభాస్‌ మొదటి షెడ్యూల్‌ ను ముగించడం జరిగిందట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మారుతి సెకండ్‌ షెడ్యూల్‌ కి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సెకండ్‌ షెడ్యూల్‌ లో ప్రభాస్ తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్ దత్‌ పాల్గొంటాడు అంటూ సమాచారం అందుతోంది. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఆయన్ను ఈ సినిమాలో నటింపజేస్తున్నారట.

ఇప్పటి వరకు వరుసగా విలన్ రోల్స్ చేస్తున్న సంజయ్ దత్‌ ఈ సినిమా కోసం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు. సహ నటుడిగా మారుతి.. ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్‌ కనిపించబోతున్నాడు అనేది బలంగా వినిపిస్తున్న వార్త. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా బాలీవుడ్‌ లో మంచి మార్కెట్‌ చేయడానికి ఆయన పాత్ర ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇప్పటి వరకు మారుతి మరియు ప్రభాస్ సినిమా యొక్క అధికారిక అప్‌డేట్‌ రాలేదు. అసలు ఈ సినిమా నిర్మాత ఎవరు అనే విషయంలో కూడా మారుతి టీమ్ క్లారిటీ ఇవ్వడం లేదు. వంద కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నాడట.

ఈ సినిమా కోసం రాజా డీలక్స్ అనే ఒక పాత కాలం నాటి థియేటర్ సెట్‌ ను ఏకంగా పది కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ వేయించాడట. ఇక వీఎఫ్‌ఎక్స్ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయబోతున్నాడని కూడా అంటున్నారు.

వీఎఫ్‌ఎక్స్ కోసం దాదాపుగా ఆరు నెలల సమయం పడుతుందని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమా లో సంజయ్ దత్‌ నటిస్తున్నాడని వస్తున్న వార్తలు అంచనాలు మరింతగా పెంచుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.