Begin typing your search above and press return to search.

ప్రభాస్ ది ఫినామినన్.. ఆదిపురుష్ కే ఇలా ఉంటే ఇక సలార్ రచ్చ రచ్చే..!

By:  Tupaki Desk   |   8 Jun 2023 11:00 AM GMT
ప్రభాస్ ది ఫినామినన్.. ఆదిపురుష్ కే ఇలా ఉంటే ఇక సలార్ రచ్చ రచ్చే..!
X
రెబల్ స్టార్ ప్రభాస్ స్టామి నా గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి తో తన కు ఏర్పడిన పాన్ ఇండియా క్రేజ్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తూ సత్తా చాటుతున్నాడు ప్రభాస్. ఇక ఆదిపురుష్ తో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపించడానికి రెడీ అయ్యాడు. ఓం రౌత్ డైరెక్షన్ లో వస్తున్న ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం తిరుపతి లో జరిగింది. ఈ ఈవెంట్ కి ప్రభాస్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోపరేషన్ తో ఈవెంట్ అంతా చాలా గ్రాండ్ గా జరిగింది.

అయితే ఆదిపురుష్ సినిమా రామాయణ కథ తో వస్తుంది. మన అందరి కీ తెలిసిన కథే.. అది కూడా కొద్ది పాటి గ్రాఫిక్స్ తో మ్యాజిక్ చేయాల ని చూస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో హంగామా ఉంటే ఇక ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ సినిమా కు ఇంకెంత రచ్చ ఉంటుందో అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆధ్యాత్మిక కథ అయినా ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ సినిమా కు సూపర్ క్రేజ్ తెచ్చారు. చూస్తుంటే ప్రభాస్ బాహుబలి 1, 2, రాధే శ్యామ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నిటినీ ఈ సినిమా దాటేలా ఉంది.

రాముడి కథ తో వస్తున్న ప్రభాస్ ని ఫ్యాన్స్ అంగీకరించారనే చెప్పాలి. అయితే ప్రభాస్ కి ఉన్న ఈ మాస్ ఫాలోయింగ్ కి సలార్ లాంటి సినిమా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆదిపురుష్ ఈవెంట్ కే అభిమానుల హంగామా ఈ రేంజ్ లో ఉంటే ఇక సలార్ సినిమా కు డబుల్ ఎనర్జీ వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సలార్ ఒక మాస్ ఫీస్ట్ అందిస్తుందని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ను చాలా ఫోకస్ గా చేస్తున్నారు. కె.జి.ఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఉంటే మాత్రం సలార్ సినిమా రికార్డులు ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

ఆదిపురుష్ తో ప్రభాస్ ఒక మంచి అటెంప్ట్ చేస్తుండగా సలార్ సినిమా ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందించేలా వస్తుంది. నిన్న ఈవెంట్ లో ఆల్రెడీ ప్రభాస్ కూడా కుదిరితే రెండు ఇంకా వీలుంటే 3 సినిమా లైనా ఏడాది కి రిలీజ్ చేస్తానని అన్నాడు. సో సలార్ ఈ ఏడాది వస్తుందా రాదా.. సెప్టెంబర్ నుంచి రిలీజ్ వాయిదా వేస్తారా లాంటి డౌట్లు పెట్టుకోవక్కర్లేదు.

ఇక సలార్ రచ్చ చేస్తే ప్రాజెక్ట్ కె తో పాన్ వరల్డ్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె విషయం లో వేసిన ప్లాన్ భారీ రేంజ్ లో ఉంది. ప్రాజెక్ట్ కె ఆల్రెడీ 2024 సంక్రాంతికి ఖర్చీఫ్ వేసింది. సో ప్రభాస్ మాస్ రాంపేజ్ బాక్సాఫీస్ దగ్గర అతని స్టామినా చూపించేందుకు ఈ సినిమాలు రెడీ అవుతున్నాయని చెప్పొచ్చు.