Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ - మ‌రుతి ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్ డేట్‌!

By:  Tupaki Desk   |   29 Aug 2022 2:30 PM GMT
ప్ర‌భాస్ - మ‌రుతి ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్ డేట్‌!
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ సినిమాల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఇప్ప‌టికే మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆదిపురుష్‌' షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మ‌రో రెండు సెట్స్ పై వున్నాయి. 'కేజీఎఫ్' డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో చేస్తున్న‌ర 'స‌లార్‌', నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో చేస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీక‌ర‌ణ యాభై శాతం పూర్త‌వ‌డంతో ప్ర‌భాస్ త‌దుప‌రి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు.

ప్ర‌భాస్ త్వ‌ర‌లో మారుతి డైరెక్ష‌న్ లో ఓ భారీ మూవీని చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. హార‌ర్ కామెడీ థ్రిల్ల‌ర్ గా ఈ సినిమాని తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని తెలుస్తోంది. ఇంత వ‌ర‌కు ప్ర‌భాస్ ట‌చ్ చేయ‌ని జోన‌ర్ ఇది.

అదే ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌భాస్ ఆస‌క్తిగా వుండ‌టానికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి తెలిసిన ద‌గ్గ‌రి నుంచి ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టండి అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఫ్యాన్స్ ఎంత‌గా ప్ర‌తిఘ‌టిస్తూ ఈ ప్రాజెక్ట్ వ‌ద్ద‌ని వాదిస్తున్న ప్ర‌భాస్ మాత్రం త‌ను చేయ‌ని జోన‌ర్ కాబ‌ట్టి ఖ‌చ్చితంగా చేయాల‌ని ఫిక్స‌య్యారు. ఇటీవ‌ల ఆగ‌స్టు 25న సైలెంట్ గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించ‌బోతున్నారు. వ‌చ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ మూవీ గురించి తాజాగా ఓ ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ ట్రెండ్ అవుతోంది. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో సాగే ఈ మూవీ తాతా మ‌న‌వ‌ళ్ల క‌థ‌గా సాగుతుంద‌ని తెలుస్తోంది.

ఓ పాడుబ‌డిన థియేట‌ర్ లో మొత్తం సినిమాని పూర్తి చేయ‌నున్నార‌ట‌. ఆ కార‌ణంగానే ఈ మూవీకి 'రాజా డీల‌క్స్' అని టైటిల్ పెట్టార‌ని తెలుస్తోంది. ఇందు కోసం ఓ స్టూడియోలో భారీ సెట్ ని రెడీ చేస్తున్నార‌ట‌.

కేవ‌లం రెండే రెండు షెడ్యూల్ ల‌లో ఈ మూవీని పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లో ప్ర‌భాస్ సెట్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. హార‌ర్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్ లు న‌టించ‌బోతున్నారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంటే మారుతి ద‌శ తిరిగిన‌ట్టే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.