Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ ను ‘సూపర్ స్టార్’ను చేసిన ప్రభాస్..!

By:  Tupaki Desk   |   5 Jan 2021 7:15 PM IST
ఆ హీరోయిన్ ను ‘సూపర్ స్టార్’ను చేసిన ప్రభాస్..!
X
‘ప్రభాస్..’ బాహుబలి తర్వాత ఈ యంగ్ రెబల్ స్టార్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకూ సౌత్ లో అందరిలో ఓ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ ఏం చేసినా.. అది ఆల్ ఓవర్ ఇండియా న్యూస్ అవుతోంది.

ఇక రాబోతున్న మూవీ ‘రాధే శ్యామ్’ కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత నటించనున్న ‘ఆదిపురుష్’ మరింత భారీగా నిర్మితం కాబోతోంది. ప్రభాస్ రాముడిగా తెరకెక్కనున్న ఈ సినిమాపై.. మొదలు కాకుండానే భారీ అంచనాలు ఏర్పడి ఉన్నాయి. ఇక, ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మరో భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమా పాన్ ఇండియానే కాదు.. పాన్ వరల్డ్ సినిమా అవుతుందని ప్రకటించాడు డైరెక్టర్!

మరి.. ఇలాంటి స్టార్.. ఒక హీరోయిన్ ను సూపర్ స్టార్ గా ఎంచుకోమంటే ఎవరిని ఎంచుకుంటాడు చెప్పండి? తనతో బాహుబలిలో నటించిన అనుష్కనా? లేక నయనతారనా? అంటే.. వీరెవ్వరూ కాదు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రాబోయే తన సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న ‘దీపికా పదుకొణె’! అవును.. తనను సూపర్ స్టార్ అంటో సంబోధించాడు ప్రభాస్. ఆమె బర్త్ డే సందర్భంగా ఇన్ స్టాగ్రాంలో విశెష్ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే టు ది గార్జియస్ సూపర్ స్టార్’ అని దీపికా పిక్ కు జత చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.