Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ లో ప్రభాస్ లుక్.. అదిరిందమ్మా!

By:  Tupaki Desk   |   11 Dec 2022 1:30 PM GMT
అన్ స్టాపబుల్ లో ప్రభాస్ లుక్.. అదిరిందమ్మా!
X
రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ పై గత కొంతకాలంగా అనేక రకాల కామెంట్స్ అయితే వినిపిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో అయితే మరి దారుణంగా కనిపించాడు. ఇక రాధే శ్యామ్ సినిమాకు వచ్చేసరికి గతంలో ఉన్న ప్రభాస్ అయితే మళ్లీ కనిపించలేదు ముఖం లావుగా అవ్వడం వలన అసలు ఏదో సర్జరీ చేయించుకున్నట్లుగా మారిపోయింది అని చాలా రకాల నెగిటివ్ ట్రోల్స్ అయితే వచ్చాయి.

అయితే ప్రభాస్ మంచితనం కారణంగా అతని రేంజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఫ్యాన్స్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. ఇక అతను లిస్టులో అయితే ప్రస్తుతం మరికొన్ని పెద్ద ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

ఇక వాటిలో ఎలా కనిపిస్తాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ముఖ్యంగా ప్రభాస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ లో ఎలా కనిపిస్తాడు అనేది కూడా అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగించింది.

ఇక ఈరోజు రామానాయుడు స్టూడియోలో అనుష్టానబుల్ షో కు సంబంధించిన షూటింగ్ కొనసాగించగా ఆ షూటింగ్ ఆ ఎపిసోడ్ షూటింగ్లో కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ అయితే చాలా బాగా వచ్చినట్లు, స్మార్ గా మారినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఉన్న లుక్ అయితే ప్రాజెక్టు కే సినిమా కోసం సెట్ చేసుకున్నది.

ఇక బాలయ్యతో ప్రభాస్ కలర్ఫుల్ షర్టుతో చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్ లుక్ అయితే మళ్లీ చాలా బాగుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ తరహాలో మార్చిన విధానం పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇక అన్ స్టాపబుల్ షో 6వ ఎపిసోడ్లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఎపిసోడ్ ను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా లేదంటే 2023 న్యూ ఈయర్ సందర్భంగా ఆహా ఓటీటీలో స్ట్రిమింగ్ కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.