Begin typing your search above and press return to search.
మొక్కలు నాటుతున్నారు సరే.. వాటి సంరక్షణ సంగతేంటి...?
By: Tupaki Desk | 23 July 2020 8:00 AM ISTప్రస్తుతం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' విస్తృతంగా నడుస్తోంది. 'పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే' అనే నినాదంతో దీనిని ముందుకు తీసుకెళ్తున్నారు. 'గ్రీన్ ఛాలెంజ్' పేరుతో చెట్లను నాటడంతో పాటు ఇతరులను నామినేట్ చేస్తూ వారితో నాటించే కార్యక్రమం విస్తృతంగా నడుస్తోంది. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న ఈ ఛాలెంజ్ లో సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సామాన్య ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. మొదటగా ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటి ఛాలెంజ్ విసరడంతో హీరో అఖిల్ అక్కినేని - ఎంపీ కవిత మొక్కలు నాటారు. ఆ తర్వాత గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన అక్కినేని నాగార్జున - రోజా - అర్జున్ - కేటీఆర్ - చిరంజీవి - పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - సచిన్ - లక్ష్మణ్ - సైనా నెహ్వాల్ - గోపిచంద్ వంటి ప్రముఖులంతా భాగస్వాములవుతూ మొక్కలు నాటారు.
కాగా ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' మూడవ విడతలో భాగంగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ తో కలసి మొక్కలను నాటాడు. కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ మూడు మొక్కలు నాటి మూడవ దశకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు సమంత - శర్వానంద్ - రష్మిక మందన్న - రాశీఖన్నా - అనుపమ పరమేశ్వరన్ - సంపత్ నంది లాంటి సినీ సెలబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసి మొక్కలు నాటారు. 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' కార్యక్రమానికి సెలబ్రెటీలు స్పందించడం బాగానే ఉంది. అయితే ఇంతవరకు నాటిన మొక్కల్ని సంరక్షిస్తున్నారో లేదో కూడా ఓ కన్నేసి ఉంచాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొక్కలు నాటి ఫొటోలు దిగడం.. వాటిని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడమే కాకుండా నాటిన మొక్కల్ని స్వయంగా సంరక్షిస్తే ఇంకా మంచిదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు తప్ప ఆల్ మోస్ట్ సెలబ్రెటీలు అంతా మొక్కల్ని తమ సొంత పెరట్లోనే నాటారు. కాబట్టి వాటిపై కన్నేసి ఉంచడం కూడా పెద్ద కష్టమేమి సలహా ఇస్తున్నారు.