Begin typing your search above and press return to search.

డార్లింగ్ ఆ పొడుగు చొక్కా స్టైల్ సంథింగ్ హాటు

By:  Tupaki Desk   |   29 April 2021 2:03 PM IST
డార్లింగ్ ఆ పొడుగు చొక్కా స్టైల్ సంథింగ్ హాటు
X
పొడుగు చొక్కా.. లూజ్ ఫ్యాంటు స్టైల్ ఇప్పుడే కొత్తేమీ కాదు. అలా భుజాల‌పైకి వేలాడే హ్యాండ్స్ ఉన్న చొక్కాలు తొడగ‌డం.. ఒక హ్యాండ్ కిందికి ఇంకో హ్యాండ్ పైకి క‌నిపిస్తూ వెరైటీ లుక్ .. మ‌న‌ ప్ర‌భాస్ కి కొత్తేమీ కాదు. `డార్లింగ్` సినిమాలో అత‌డి స్టైల్ లూజ్ చొక్కాల‌తో మాసీగా క‌నిపిస్తూనే ఏదో ఆక‌ర్ష‌ణీయ‌మైన టింజ్ తో క‌నిపిస్తుంది. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి లూజ్ చొక్కా స్టైల్ తో అద‌ర‌గొట్టాడు.

బుధవారం రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో తెలుపు రంగు లూజ్ టీష‌ర్ట్ తో డప్పర్ స్టైల్లో క‌నిపించాడు. ప్ర‌భాస్ నడుచుకుంటూ వెళుతుంటే స్నాప్ లు క్లిక్ మ‌న్నాయి. ఆర్మీ స్టైల్లో ఆ స్పెష‌ల్ ట్రాక్ ఫ్యాంట్ కాంబినేష‌న్.. ముఖానికి మాస్క్.. ఆల్మోస్ట్ ఫేస్ షీల్డ్ ని త‌ల‌పించే గ్లాసెస్ తో అత‌డు ఫుల్ ప్యాక్డ్ గా క‌నిపించాడు.

ఇంత‌కీ ప్ర‌భాస్ ఎక్క‌డికి వెళ్లారు? అంటే.. ఎక్కడికో వెళ్లాలని అనుకున్నా ర‌క‌ర‌కాల‌ కారణాల వల్ల తిరిగి హైదరాబాద్ కు వచ్చాడని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మ‌రోవైపు ఆదిపురుష్ 3డి- స‌లార్ చిత్రీక‌ర‌ణ‌ల్లో ఉన్నాయి. నాగ్ అశ్విన్ తోనూ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్ర‌స్తుత క్రైసిస్ నెమ్మ‌దిస్తే సెట్స్ కెళ‌తార‌ని స‌మాచారం.