Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న డార్లింగ్ ప్రభాస్ 'కిస్ మీ' వీడియో...!

By:  Tupaki Desk   |   14 Jun 2020 11:58 AM IST
వైరల్ అవుతున్న డార్లింగ్ ప్రభాస్ కిస్ మీ వీడియో...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని ప్రతి సీన్ అద్భుతంగా మలిచాడు జక్కన్న. ముఖ్యంగా 'బాహుబలి 2'లో బాహుబలి మాహిస్మతి సర్వ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ''అమరేంద్ర బాహుబలి అనే నేను..'' అని చెప్పే సీన్ ఆ సినిమాకే హైలెట్‌ గా నిలిచింది. ఈ సీన్ పై సోషల్ మీడియాలో వేలకొలది మీమ్స్, పేరడీ వీడియోస్ క్రియేట్ చేసేశారు. తాజాగా ఈ సినిమాలోని ఈ సీన్‌ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్‌ చల్ చేస్తుంది. క్రియేటివిటీకి ఇదే నిదర్శనం అనేలా ఎడిట్ చేసిన ఆ సీన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకార డైలాగ్స్ ని క్యాడ్‌ బెరి యాడ్‌ లా ఎడిట్ చేసారు. ''కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్'' అని ప్రభాస్ చెప్తున్నట్లుగా పర్ఫెక్టుగా సింక్ అవ్వడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే దీన్ని చూసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. 'హాలీవుడ్ రెబల్ స్టార్' అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియో వైరల్ అయ్యేలా చేశారు మంచు మనోజ్. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ విపరీతంగా షేర్లు చేసేస్తున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి