Begin typing your search above and press return to search.

అంచనాలన్నీ ప్రభాస్‌ చుట్టూ ఉన్నాయ్‌

By:  Tupaki Desk   |   26 Oct 2015 10:28 AM IST
అంచనాలన్నీ ప్రభాస్‌ చుట్టూ ఉన్నాయ్‌
X
జాతీయ స్థాయిలో క్రేజు రావ‌డం మాటేమో కానీ, అది కొన్నిసార్లు అన‌వ‌సర‌మైన ఒత్తిళ్ల‌ను కూడా పెంచేస్తుంది న‌టీన‌టుల‌పై. సౌత్ నుంచి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న న‌టీన‌టులెంద‌రో ఉన్నారు. కానీ ఇటీవ‌లి కాలంలో మ‌న టాలీవుడ్ నుంచి ఆ స్థాయిలో గుర్తింపు పొందిన హీరోలెవ‌రూ లేరు! ఒక్క ప్ర‌భాస్ త‌ప్ప‌! బాహుబ‌లి సినిమాతో ఇప్పుడు అత‌డు నేష‌న‌ల్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిగ‌ర్ అయిపోయాడు. వీర‌త్వం ఉన్న వీరుడిగా క‌నిపిస్తున్నాడు. అందుకే నిత్యం బాలీవుడ్ వార్త‌ల్లో నానుతున్నాడు.

ప్ర‌భాస్‌ కి 36 వ‌య‌సు వ‌చ్చేసినా ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ ఓ వార్త‌. ముంబైలోనే పిల్ల‌ను వెతుక్కుంటున్నాడా? అంటూ వేరొక వార్త‌. రాజ‌మౌళితో ప్ర‌భాస్‌ కి స‌ఖ్య‌త లేదిప్పుడు. అందుకే బాహుబ‌లి 2 ఆల‌స్యం అవుతోంది అంటూ వేరొక ర‌క‌మైన ప‌బ్లిసిటీ. ప్ర‌భాస్ దూమ్ 4లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని, క‌ర‌ణ్‌ జోహార్‌ తో ఓ భారీ ప్రాజెక్టు కోసం చ‌ర్చ‌లు సాగిస్తున్నాడ‌ని .. ఇలాంటి రూమ‌ర్లెన్నో లెక్క‌కు మిక్కిలిగా పుట్టుకొస్తున్నాయ‌క్క‌డ‌. అయితే రూమ‌ర్ ఏదైనా ప్ర‌భాస్‌ కి జాతీయ స్థాయిలో బోలెడంత ప్ర‌చారం వ‌చ్చేస్తోంది. దీనివ‌ల్ల అత‌డిపై అంచ‌నాలు కూడా ఆ స్థాయిలోనే పెరిగిపోతున్నాయి. ఇది స‌రైన అవ‌కాశ‌మే. తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో ప్ర‌భాస్ త‌న స్థాయిని పెంచుకునే అరుదైన సంద‌ర్భ‌మిది. ఏం చేస్తాడో చూడాలి.