Begin typing your search above and press return to search.

నెక్ట్స్ లెవ‌ల్ హీరోయిజం చూపించ‌బోతున్న డార్లింగ్..!

By:  Tupaki Desk   |   12 Feb 2021 4:00 PM IST
నెక్ట్స్ లెవ‌ల్ హీరోయిజం చూపించ‌బోతున్న డార్లింగ్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజాహెగ్డే జంటగా నటించిన పీరియాడికల్ లవ్ స్టోరీ ''రాధే శ్యామ్''. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణా మూవీస్‌ - యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్‌ - ప్రశీద కలిసి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయనున్నారు. అయితే 'రాధే శ్యామ్' సినిమాని జూన్ లేదా జూలై నెలలో విడుద‌ల చేయడానికి మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అందులోనూ జూలై 2 లేదా జులై 30 తారీఖ‌లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మధ్య కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభాస్.. ఈసారి ఫుల్ అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో రాబోతున్నాడు. అయినప్పటికీ సినిమా క్లైమాక్స్ లో భారీ యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేశారట. ప్ర‌భాస్ కొన్ని సీన్స్ లో నెక్ట్స్ లెవ‌ల్ హీరోయిజం చూపించ‌బోతున్నాడని ఇప్పటికే టాక్ నడుస్తోంది. సినిమా మొత్తం ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ కి ఉన్న యాటిట్యూడ్ తోనే ప‌రుగులు పెడుతుందట. మొత్తం మీద డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉండేలా ఈ 'రాధే శ్యామ్' ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న టీజర్ తో రిలీజ్ డేట్ తో పాటు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాలపై క్లారిటీ రానుంది.

'రాధే శ్యామ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు. హిందీ వర్షన్ కి మిథున్ - మనన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో జగపతిబాబు - సత్యరాజ్ - భాగ్య‌శ్రీ - కునాల్ రాయ్ క‌పూర్‌ - స‌చిన్ ఖేడ్కర్‌ - ముర‌ళి శ‌ర్మ‌ - శాషా ఛ‌త్రి - ప్రియ‌ద‌ర్శి - రిద్దికుమార్‌ - స‌త్యాన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.