Begin typing your search above and press return to search.

డౌన్ టు ఎర్త్ అంటే ప్ర‌భాస్ నే చూపించాలి

By:  Tupaki Desk   |   12 July 2021 5:00 PM IST
డౌన్ టు ఎర్త్ అంటే ప్ర‌భాస్ నే చూపించాలి
X
రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ `రాధేశ్యామ్` త్వ‌ర‌లో రిలీజ్ కి రానుంది. ఇప్ప‌టికే మెజారిటీ షూటింగ్ పూర్త‌యింది. యూనిట్ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉంది. ఈ చిత్రంలో పూజాహెగ్డే క‌థానాయిక కాగా.. వెట‌ర‌న్ న‌టి భాగ్య శ్రీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్- భాగ్య శ్రీ మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల్ని ఇటీవ‌ల‌ చిత్రీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఆన్ సెట్స్ ప్ర‌భాస్
న‌డ‌వ‌డిక‌పై సీనియ‌ర్ న‌టీమ‌ణి భాగ్య‌శ్రీ‌ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని చెప్పుకొచ్చారు. డార్లింగ్ ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ డ‌మ్ తో వెలిగిపోతున్నా కానీ.. ఆయన సెట్లో చాలా సింపుల్ గా స‌ర‌దాగా ఉంటారు. ఇద్ద‌రం క‌లిసిన‌ప్ప‌డు ఎక్కువ‌గా ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం. ఆయ‌న ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం మా అంద‌రితో షేర్ చేసుకునేవారు.

``ఓ పెద్ద స్టార్ అలా ఉండ‌టం చిన్న విష‌యం కాదు. చాలా అరుదుగా మాత్ర‌మే అలాంటి న‌టులు దొరుకుతారు. డౌన్ టు ఎర్త్ అనే దానికి ప్ర‌భాస్ ఉదాహ‌ర‌ణ‌. ఇత‌ర న‌టుల ప‌ట్ల ఆయ‌న న‌డుచుక‌నే విధానం ఎంతో న‌చ్చుతుంది.. ``అని భాగ్య శ్రీ అన్నారు. తెలుగు -త‌మిళం- హిందీ భాష‌ల్లో రాధేశ్యామ్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కానుంది. హిందీ వెర్ష‌న్ లో త‌న పాత్ర‌కు భాగ్యశ్రీనే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెబుతున్న‌ట్లు ఆమె తెలిపారు.

ఓవైపు పెండింగ్ షూట్ పూర్తి చేస్తూనే మూవీ హార్డ్ క‌ట్ పైనా రిపోర్టులు లీక్ చేస్తుడ‌డం ఆస‌క్తిక‌రం. ఇటలీ నేప‌థ్యంలోని పీరియడ్ లవ్ స్టోరీ ఇది. తెలుగు ఆడియెన్ తో పాటు..హిందీ ఆడియెన్ కి విప‌రీతంగా న‌చ్చేస్తుంద‌న్న టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఈ మూవీని ఇటీవ‌ల ల్యాబ్ లో చూశార‌ని ఔట్ పుట్ ఆక‌ట్టుకుందని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి. దర్శకుడు రాధా కృష్ణ ప‌నిత‌నం విష‌యంలో ప్రభాస్ చాలా సంతోషంగా ఉన్నాడు. పూజా హెగ్డే లుక్ .. ఈ చిత్రంలో న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌తిదీ న‌చ్చాయ‌ట‌. రాధేశ్యామ్ టీమ్ నుంచి లీకైన విశేషాలివి.

వాస్త‌వానికి జూలై 30న ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉన్నా.. సెకండ్ వేవ్ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మైంది. ఇంకా కొత్త రిలీజ్ తేదీని టీమ్ ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్దే క‌థానాయిక‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బహు భాషలలో విడుదల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంది.

రాధే బాట‌లో వ‌స్తుందా?

క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ అనంత‌రం రాధేశ్యామ్ రిలీజ్ పై ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. స‌ల్మాన్ భాయ్ న‌టించిన రాధే త‌ర‌హాలోనే థియేట్రిక‌ల్ రిలీజ్ తో పాటు ఓటీటీల్లో పే-ప‌ర్ వ్యూ విధానంలో అందుబాటులో ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. థియేట్రిక‌ల్ రిలీజ్ తో పాటు సైమ‌ల్టేనియ‌స్ గా ఈ విధానం అందుబాటులోకి తెస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇటీవ‌ల ప‌రిణామాల దృష్ట్యా రాధేశ్యామ్ ఓటీటీల్లోకి వ‌చ్చే అవ‌కాశం లేదు. థియేట్రిక‌ల్ రిలీజ్ కోసం మాత్ర‌మే వేచి చూస్తున్నార‌ని తెలుస్తోంది.