Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్‌'తో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ప్రభాస్ సోదరి..!

By:  Tupaki Desk   |   10 July 2020 7:23 PM IST
రాధే శ్యామ్‌తో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ప్రభాస్ సోదరి..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'రాధే శ్యామ్‌'తో ప్రభాస్ సోదరి కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుండి తన తమ్ముడు ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు ఇండస్ట్రీకి వచ్చారు. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో కృష్ణంరాజు నటించే సినిమా నిర్మాణం చూసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అదే ఫ్యామిలీ నుండి ప్రభాస్ రాజు హీరోగా పరిచయమయ్యారు. 'ఈశ్వర్' సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన ప్రభాస్ అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక 'బాహుబలి' 'సాహో' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ క్రమంలో ప్రభాస్ కజిన్ ఉప్పలపాటి ప్రమోద్ 'యూవీ క్రియేషన్స్' ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ సోదరి ప్రశీదా కూడా నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు.

కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లలో పెద్ద అమ్మాయి అయిన ప్రశీదా 'రాధే శ్యామ్‌' సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ రోజు రిలీజ్ చేసిన 'రాధే శ్యామ్‌' ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. 'రాధే శ్యామ్‌' కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ వంశీ - ప్రమోద్ మరియు గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రశీదా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశీదా అప్పుడప్పుడు తండ్రితో కలిసి సినిమా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతున్నా సినిమా విషయంలో మాత్రం ఇంత వరకు ఎంటర్ అవలేదు. ఇక అప్పుడప్పుడు అన్నయ్య ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్‌'కి ప్రొడ్యూసర్ గా మారి ఇండస్ట్రీ ద్రుష్టి తనవైపు మళ్లించుకుంది. గోపికృష్ణ బ్యానర్ పై ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలను నిర్మించగా.. చివరగా ప్రభాస్ తో 'బిల్లా' మూవీని ప్రొడ్యూస్ చేసారు. ఇప్పుడు ప్రశీదా ఆధ్వర్యంలో రెగ్యులర్ గా మూవీస్ నిర్మిస్తారేమో చూడాలి.