Begin typing your search above and press return to search.

గతం ఒకెత్తు, బాహుబలి ఒకెత్తు -ప్రభాస్‌

By:  Tupaki Desk   |   5 July 2015 1:42 PM IST
గతం ఒకెత్తు, బాహుబలి ఒకెత్తు -ప్రభాస్‌
X
ఇకనుంచి బాహుబలి ముందు, బాహుబలి తర్వాత ప్రభాస్‌ కెరీర్‌ని విశ్లేషించాల్సి వస్తుంది. అయితే బాహుబలి ముందు టెన్షన్లు, బాహుబలి కోసం టెన్షన్లు, బాహుబలి తర్వాత టెన్షన్లు ఇన్ని విషయాల్ని ప్రభాస్‌ ముచ్చటించాడు.

=బాహుబలి గ్రాండియర్‌ సినిమా. దీనికోసం మూడేళ్ల పాటు ఎందుకు వేచి చూశానో ఇప్పుడు అర్థమవుతుంది. ఫ్యాన్స్‌ ఫీలయ్యే ఉంటారు. కానీ ఈ సినిమా చూశాక ఎందుకు ఇంతకాలం పట్టిందో వాళ్లకు అర్థమవుతుంది. నా గతమంతా ఒకెత్తు, బాహుబలి ఒక్కటే ఒకెత్తు.

=బాహుబలి కంటే ముందు సినిమాలకు బోలెడన్ని టెన్షన్లు ఎదుర్కొన్నా. కానీ బాహుబలి కోసం రెట్టింపు ఎదుర్కొన్నా. టెన్షన్లే టెన్షన్లు. అన్ని టెన్షన్లకు ఇక ముగింపు పలికినట్టే.

=భారీ బడ్జెట్‌ కారణంగా అత్యధిక థియేటర్లలో అత్యధిక భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం అనుకున్నాం. మూడేళ్ల క్రితం 20నిమిషాల కథ విన్నా. నాటి నుంచి ఎప్పుడు రిలీజ్‌ అని ఎదురు చూశా. ఇప్పటికి వీలుపడింది.

=బాహుబలికి ముందు శ్రీకృష్ణదేవరాయలుపై, అల్లూరి సీతారామరాజుపై, ఒక రాజుగారిపై కథలు చెప్పారు. నాలుగైదు లైన్లే .. కానీ ఎక్కడో అసంతృప్తి. చివరికి బాహుబలి కథ చెప్పారు.

=సెప్టెంబర్‌ 15 నుంచి రెండో భాగం చిత్రీకరణకు వెళుతున్నాం. పద్ధతి ప్రకారం వర్కవుట్లు చేయాలి. ముందుకెళ్లాలి. దీనికి ప్లానింగ్‌ ముఖ్యం. దీన్నిబట్టే తర్వాతి సినిమా ఉంటుంది. ఈ మధ్యలో గ్యాప్‌ వస్తే వేరొక సినిమా ఏదైనా చేయాలి.

=ముందుగా ఒకే పార్ట్‌గా సినిమా చేయాలనుకున్నాం. కానీ అలా చేస్తే ఎమోషన్‌ మిస్సవుతుందనిపించి రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు.

=జీవితంలో ఒకే ఒక్కటి. లైన్‌, కథ చెప్పారు. విజన్‌ చెప్పారు. ఎన్ని భాషల్లో రిలీజ్‌ చేస్తామో చెప్పారు. దేశంలోనే అతిపెద్ద మోషన్‌ సినిమా ఇది. 40,50 ఏళ్లలో ఇలాంటిది రాలేదు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా తెరకెక్కుతున్నప్పుడు దానికోసం నేను సమయం కేటాయిస్తే చాలు. నేను అదే చేశాను. మిగతావన్నీ రాజమౌళి చూసుకున్నారు. టీమ్‌ అంతా వ్యక్తిగత జీవితాన్ని వదులుకుని మరీ పనిచేశారు.

=380రోజుల షూటింగులో 300రోజులు నా పార్ట్‌. 250రోజులు యాక్షన్‌కే కేటాయించా. షూటింగ్‌ టైమ్‌లో భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. భుజం నొప్పి అంతకంటే ముందే ఉన్నా, ఈ ఆపరేషన్‌తో నొప్పి మరింత పెరిగింది. వెయిట్స్‌ ఎత్తినప్పుడు మరింతగా ఇబ్బంది పెట్టింది.

=నా పెళ్లిపై వస్తున్నవన్నీ రూమర్స్‌. ఏదో ఒక రోజు తప్పదు. చేసుకుంటా. అప్పుడు చెబుతా.

=ఒక సినిమా వసూళ్లు, హిట్టుతో నంబర్‌ వన్‌ అని చెప్పలేం. అది పది పదిహేనేళ్ల ప్రాసెస్‌.

=శివతో తెలుగు సినిమాని తెలుసుకున్నామని, బాహుబలితో తెలుగు సినిమా అంటే ఏంటో తెలుసుకున్నామని ముంబైవాలాలు ప్రశంసిస్తున్నారు.