Begin typing your search above and press return to search.

ప్రభాస్‌.. ప్రశాంత్‌ ల 'సలార్‌' అర్థం ఇదే

By:  Tupaki Desk   |   3 Dec 2020 11:00 AM IST
ప్రభాస్‌.. ప్రశాంత్‌ ల సలార్‌ అర్థం ఇదే
X
బాహుబలి స్టార్‌ ప్రభాస్‌.. కేజీఎఫ్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. కొన్ని రోజులుగా ప్రభాస్‌.. ప్రశాంత్‌ నీల్‌ ల కాంబోలో సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని చాలా ప్రభాస్‌ ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలు ఉన్నాయి కనుక పుకార్లే అయ్యి ఉంటాయి అనుకున్నారు. పవర్‌ ఫుల్‌ లుక్‌ తో అధికారికంగా ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది. 'సలార్‌' అనే టైటిల్‌ తో మోస్ట్‌ వయోలెంట్‌ మాన్‌ గా ప్రభాస్‌ ను ప్రశాంత్‌ నీల్‌ చూపించబోతున్నాడు.

పాన్‌ ఇండియా మూవీగా దీనిని విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో అన్ని భాషల్లో కూడా ఒకే టైటిల్‌ ఉండాలని 'సలార్‌' ను ఫిక్స్‌ చేశారు. టైటిల్‌ అర్థం ఏంటీ అంటూ చాలా మంది నెట్‌ లో సెర్చ్‌ చేస్తున్నారు. సలార్‌ కు చాలా అర్థాలు వస్తున్నాయి. సలార్‌ అంటే ఉర్దులో ధైర్యవంతుడు అయిన నాయకుడు అని అర్థం.

ఒక బలహీన తెగకు చెందన వ్యక్తి సలార్‌ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథగా చెబుతున్నారు. టైటిల్‌ కు తగ్గట్లుగానే ప్రభాస్ ఈ సినిమా కోసం అత్యంత పవర్‌ ఫుల్‌ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్‌ లుక్‌ లోనే ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. వచ్చే జనవరి నుండి 'సలార్‌' ను ప్రారంభించబోతున్నారు. రాధేశ్యామ్‌ ముగిసిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.