Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ ని ఏమార్చారే!

By:  Tupaki Desk   |   24 Oct 2018 6:09 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ ని ఏమార్చారే!
X
నిన్న ప్రభాస్ ఫ్యాన్స్ సాహో షేడ్స్ వీడియోను చూసుకుంటూ మురిసిపోవడంలోనే రోజు గడిచిపోయింది. ఏడాది తర్వాత వచ్చిన అప్ డేట్ కావడంతో వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నిజానికి ఈ నెల 23న ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని ప్రభాస్ తన ఫేస్ బుక్ లో ప్రకటించినప్పుడు లేడీ ఫ్యాన్స్ తో సహా అందరు అది పెళ్లి గురించిన స్వీట్ న్యూస్ అనే అనుకున్నారు. దానికి తగ్గట్టు గుంటూరు వ్యాపారవేత్త కూతురితో సంబంధం ఖాయమైనట్టు కొన్ని వార్తలు కూడా రావడంతో అదే అనుకుని ఆ అంచనాలో ఉన్నారు.

సాహో టీజర్ ఆశించిన అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ వాటికి భిన్నంగా సాహో మేకింగ్ వీడియో విడుదల చేసి స్వీట్ షాక్ ఇచ్చారు. ఏదైతేనేం యాక్షన్ స్టాండర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో క్లారిటీ వచ్చేసింది. అప్పుడే ఇది బాలీవుడ్ సహా అన్ని చోట్లా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇదిలా ఉంచితే ఇప్పుడైతే సైడ్ ట్రాక్ చేసారు కానీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు అనేది మళ్ళి భేతాళ ప్రశ్నలాగా మొదటికే వచ్చేసింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా మరో రెండేళ్లలో నలభై పడిలో అడుగు పెట్టనున్న ప్రభాస్ ఇప్పటికైనా నచ్చిన అమ్మాయికి మూడు ముళ్ళు వేయాలని సగటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

కానీ పెదనాన్న కృష్ణంరాజు మొదలుకుని మన హీరో దాకా ఆ ఒక్కటి అడక్కు అంటూ తప్పించుకుంటున్నారు కానీ అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. ఈ ఏడాది మరో రెండు నెలల్లో ముగిసిపోతుంది. మరి 2019లో అయినా ఆ శుభ ఘడియలు రావాలని ప్రభాస్ ఫ్యామిలీనే కాదు సినిమా చూసే అలవాటు ఉండి అతన్ని ఇష్టపడే ప్రతిఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో.