Begin typing your search above and press return to search.

బందిపోటులా మారబోతున్న ప్రభాస్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   27 May 2021 1:30 AM GMT
బందిపోటులా మారబోతున్న ప్రభాస్ హీరోయిన్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే ప్రస్తుతం పలు సినిమాలను చేస్తోంది. కొన్ని సినిమాలు షూటింగ్‌ ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉండగా మరి కొన్ని సినిమాలు షూటింగ్‌ మద్యలో ఉన్నాయి. ఇక త్వరలో ప్రారంభం అవ్వబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మరికొన్ని కొత్త సినిమాలకు కూడా ఈమె కమిట్‌ అవుతూ ఉంది. బాలీవుడ్‌ లో భారీ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు దీపిక పెట్టింది పేరుగా నిలుస్తుంది. అందుకే ఈమెతో సంజయ్ లీలా భన్సాలీ ఒక భారీ సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.

భర్తతో నటించిన 83 సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.. ఇక ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో దీపిక నటించాల్సి ఉంది. ఇదే సమయంలో ఈమె సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం లో బైజు బావ్రా అనే సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లతో ఈ సినిమా విజయం సాధించేలా ఒక మంచి కాన్సెప్ట్ ను సంజయ్‌ లీలా భన్సాలీ ఎంపిక చేసుకున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో దీపిక పదుకునే బందిపోటు గా కనిపించబోతుంది. సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్‌ తో గంగుభాయ్ సినిమాను తెరకెక్కించాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాలో ఆలియా భట్‌ లుక్‌ మరియు పాత్ర చాలా విభిన్నంగా ఉంది. అంతకు మించి అన్నట్లుగా దీపిక పాత్రను బైజు బావ్రా సినిమాలో చూపించబోతున్నాడట. దీపిక మార్కెట్‌ నేపథ్యంలో ఈ సినిమా పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారని సమాచారం.