Begin typing your search above and press return to search.

'బాలీవుడ్'లో జెండా పాతేసిన ప్రభాస్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   8 April 2021 11:30 PM GMT
బాలీవుడ్లో జెండా పాతేసిన ప్రభాస్ హీరోయిన్..!
X
ఇండస్ట్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే కొందరు ఇండస్ట్రీలో అడుగుపెట్టగానే స్టార్డం అందుకొని బిజీ అయిపోతారు. కొందరు ఇండస్ట్రీలో ఎన్నేళ్లుగా సినిమాలు చేసినా అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేరు. కానీ కొందరు మాత్రమే మొదట్లో తడబడినా కొంతకాలానికి ఎప్పుడూ లేనివిధంగా బిజీ అయిపోతారు. ప్రస్తుతం అలాంటి దశలోనే ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్.. అదేనండి యంగ్ అండ్ టాల్ యాక్ట్రెస్ కృతిసనన్. ఈ అమ్మడు తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది కానీ తెలుగులో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్డం అందుకొని మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్ గా మారింది. అవును బాలీవుడ్ సినిమాలే కాదు.

అటు పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తోంది కృతి. ఆమె తన జీవితంలో ఎన్నడూ ఊహించని రేంజిలో బిజీ అయిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. నిజానికి కృతి కటౌట్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం అమ్మడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన 'ఆదిపురుష్' అనే సినిమా చేస్తోంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఆ సినిమాతో కృతి ప్రపంచదేశాలకు పరిచయం కాబోతుంది. అలాగే అక్షయ్ కుమార్ సరసన బచ్చన్ పాండే, భేడియా, గణపత్, మిమీ, హమ్ దో హమారే దో సినిమాలు చేస్తోంది. కృతి హోల్ కెరీర్ పరంగా చూస్తే ఫస్ట్ టైం హీరోయిన్ గా ఇంత బిజీ కావడం అంటోంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే సినిమాలు ఎంజాయ్ చేస్తుందట కృతి.