Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 'గోల్డెన్ గర్ల్'గా ప్రభాస్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   20 May 2021 11:30 AM GMT
బాలీవుడ్ గోల్డెన్ గర్ల్గా ప్రభాస్ హీరోయిన్..!
X
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే.. త్వరలో పాన్ ఇండియా హీరోయిన్ కాబోతుంది. ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ అనే తేడాలేకుండా టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్ స్టార్ హీరోలతో మూవీస్ లైనప్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నటువంటి సినిమాలన్ని కూడా పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. కొంతకాలంగా పూజా వరుస హిట్లతో దూసుకుపోతుంది. అయితే ఇటీవలే ఏప్రిల్ చివరివారంలో కరోనా మహమ్మారి సోకి హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళింది. సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నటువంటి పూజా.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. అందుకే అమ్మడి కోసం స్టార్ హీరోలు - మేకర్స్విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. వేలసంఖ్యలో కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పూజాహెగ్డే కరోనా బారినపడి కోలుకుని ఆరోగ్యంగా ఉంది. అయితే ప్రస్తుతం పూజా కూడా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఫాలోయర్లకు కరోనా గురించి అవగాహనా కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమ్మడి గురించి సోషల్ మీడియాలో సినీవర్గాలలో పలు క్రేజీ పుకార్లు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే.. టాలీవుడ్ ప్రేక్షకులు పూజాను బుట్టబొమ్మ అంటూ పిలుచుకుంటారు. గతేడాది అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ అయినప్పటి నుండి పూజాను అలా పిలుచుకుంటున్నారు.

అయితే బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం పూజాను గోల్డెన్ గర్ల్ అని పిలుచుకుంటున్నారట. మరి ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోల సరసన చక్రం తిప్పుతోంది. ఇదివరకు హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ సరసన మొహేంజోదారో - ఇటీవల అక్షయ్ కుమార్ సరసన హౌస్ ఫుల్-4 సినిమాలు చేసింది. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో కబీ ఈద్ కబీ దీవాలి - స్టార్ హీరో రన్వీర్ సింగ్ తో సర్కస్ సినిమాలు చేస్తోంది. వీటితో పాటుగా పూజా డార్లింగ్ ప్రభాస్ తో రాధేశ్యామ్ అనే రొమాంటిక్ లవ్ స్టోరీలో నటించింది. ఆ సినిమా త్వరలోనే విడుదలకు రెడీ అవుతోంది. అయితే మరి బాలీవుడ్ వర్గాలు మాత్రం పూజాను గోల్డెన్ గర్ల్ అని పిలుస్తున్నారని టాక్. కానీ ఆ బిరుదు ఇదివరకు యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు దక్కింది. మున్నామైకేల్ సినిమాతో బాలీవుడ్ డెబ్యూ చేసిన నిధిని ఆ టైంలోనే గోల్డెన్ గర్ల్ అని పిలిచారు. మొత్తానికి బాలీవుడ్ లో గోల్డెన్ హీరోయిన్స్ సంఖ్య మెల్లగా పెరుగుతూనే ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.