Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ భూవివాదం.. కోర్టు ఏమంది?

By:  Tupaki Desk   |   24 April 2019 9:44 AM IST
ప్ర‌భాస్ భూవివాదం.. కోర్టు ఏమంది?
X
గ‌త కొంత‌కాలంగా డార్లింగ్ ప్ర‌భాస్ పేరు ఓ భూవివాదంలో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కీ ఆ వివాదం కోర్టుల ప‌రిధిలో ప‌రిష్కారం అయ్యిందా? అంటే .. తాజాగా హైకోర్టులో దీనిపై తీర్పు వెలువ‌డింది. వివ‌రాల్లోకి వెళితే..

హైద‌రాబాద్ రాయద‌ర్గం ప‌న్మ‌క్తా గ్రామంలోని త‌న ఫామ్ హౌస్‌ డార్లింగ్ ప్ర‌భాస్ వివాదానికి కార‌ణం. అత‌డికి సంబంధించిన ఓ అతిధి గృహాన్ని జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేయ‌డంతో ప్ర‌భాస్ కోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న హైకోర్టు మంగ‌ళ‌వారం ఆస‌క్తిక‌ర తీర్పుని వెలువ‌రించింది. క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా అత‌ను కొనుగోలు చేసిన భూమిని నుంచి అత‌న్ని ఖాళీ చేయించ‌డం చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని చెబుతూనే.. ఆ వివాదాస్ప‌ద భూమిని అత‌నికి అప్ప‌గించ‌మ‌ని చెప్ప‌లేం అని తేల్చి చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌కు ప్ర‌భాస్ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుపై ఎనిమిది వారాల్లోగా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని జ‌స్టిస్ వి. రామ‌సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌ - జ‌స్టిస్ పి. కేశ‌వ‌రావుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ప్ర‌భాస్ వేసిన కేసుపై పూర్తిగా విచార‌ణ చేసిన హైకోర్టు ధ‌ర్మాస‌నం అత‌ను సూచించిన స్థ‌లం వివాదంలో వుంద‌ని తేల్చి చెప్పింది. అయితే స‌ద‌రు స్థ‌లాన్ని స్వాధీనం చేసుకోవ‌డం విష‌యంలో మాత్రం సంబంధిత రెవెన్యూ అధికారులు అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌ని.. ప్ర‌భాస్ పెట్టుకున్న క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ద‌ర‌ఖాస్తును ప్ర‌భుత్వం తిర‌స్క‌రిస్తే త‌ను మ‌ళ్లీ కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చిన పేర్కొంది.

తాజా కోర్టు విచార‌ణ‌లో ప‌న్మ‌క్తా గ్రామంలో భూములు ఆరు ద‌శాబ్ధాలుగా వివాదాల్లో ఉన్నాయ‌ని తేలింది. ప్రభాస్‌ దరఖాస్తును పరిశీలించాక జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా వందల ఎకరాల్లో యాజమాన్య హక్కుల వివాదం ఎదుర్కొంటున్న వారు కూడా ప్రభాస్‌ లాగే దరఖాస్తు చేసుకునే వీలుందని ... భూమి ఎవరి స్వాధీనంలో ఉందో వారు రిజిస్టర్డ్‌ విక్రయ దరఖాస్తుల ద్వారా దక్కిన హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా క్రమబద్ధీకరణ చేసుకోవ‌డం ద్వారా ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం వస్తుందని కోర్టు తీర్పు వెలువ‌రించింది. అదే సమయంలో హక్కుల సమస్య తీరుతుంది.. ఆరు దశాబ్దాల వివాదానికి తెరదించవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో ప్ర‌భాస్ కి కొంత ఊర‌ట ల‌భించిన‌ట్ట‌య్యింది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో.. జాన్ సినిమాల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కోర్టు వివాదం అత‌డి బిజీ షెడ్యూల్స్ కి చిన్న‌పాటి బ్రేక్ ఇచ్చింద‌ని తెలుస్తోంది.