Begin typing your search above and press return to search.

విదేశాల్లో రిలాక్స్‌ అవుతున్న బాహుబలి

By:  Tupaki Desk   |   18 July 2015 11:17 AM IST
విదేశాల్లో రిలాక్స్‌ అవుతున్న బాహుబలి
X
బాహుబలి ఫలితం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. బాలీవుడ్‌ ప్రముఖులు సైతం నోరెళ్లబెట్టారు. దర్శకదిగ్గజరం రాజమౌళికి జోహార్‌ అంటూ విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ శుభసందర్భాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఎవరేం చేస్తున్నారు అని ఆరాతీస్తే.. ప్రభాస్‌ యూరప్‌ వెళ్లిపోతున్నాడు.

ఐదుగురు చిన్ననాటి క్లాస్‌ మేట్స్‌ కలిసి యూరప్‌ వెళ్లిపోతున్నా. ఫుల్లుగా ఎంజాయ్‌ చేసి వస్తానని ప్రభాస్‌ చెప్పాడు. అంతేనా జక్కన్న ఏం చేస్తున్నాడు? అన్న ప్రశ్నకి అతడు మొదటివారం పూర్తయ్యే వరకూ శాంతించలేదు. ఇప్పుడు వసూళ్లు చూసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక అతడు కూడా విదేశాల్లో రిలాక్సవ్వడానికి కుటుంబ సమేతంగా పయనమవుతున్నాడని చెప్పాడు.

విదేశాల నుంచి తిరిగి రాగానే ఇక పార్ట్‌ 2 కోసం కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే 300రోజులు కాల్షీట్లు ఇచ్చేశా. అన్నిరోజులు ఎందుకు? అని అంటోంది అమ్మ. అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా. అయితే బాహుబలి 2 కోసం ఆ మాత్రం తప్పదని చెప్పాను.

అసలు బాహుబలి విజయం వెనుక ఏం పనిచేసింది? అని అడిగితే 'టీమ్‌ వర్క్‌ బాగా పనిచేసింది'. అందరం దర్శకుడినే అనుసరించాం. అలాగే నిర్మాతల ఫ్యాషన్‌ని మర్చిపోకూడదు. అంత పెట్టుబడి పెట్టి కూడా వాళ్లు రిలీజ్‌ ముందు కూల్‌గా ఉండడం చూసి ఆశ్చర్యపోయా. అలా ఎందుకు ఉన్నారో ఇప్పుడర్థమైంది. అలాగే రెండో భాగంలోనూ రానా, అనుష్క పాత్రలు హైలైట్‌ గా ఉంటాయి. అదంతా కథలో భాగమే. మేమంతా కథని, దర్శకుడిని అనుసరిస్తున్నామంతే.. అనేశాడు.

అంతేకాదు.. నేను కెరీర్‌ ని ఎప్పుడూ ప్లాన్‌ చేయలేదు. దానంతట అదే ముందుకు సాగుతోంది. బాహుబలి 2 పూర్తయ్యేవరకూ ఇక ఏదీ ప్లాన్‌ లేదు.. అంటూ చెప్పేశాడు డార్లింగ్‌!!