Begin typing your search above and press return to search.

మీడియాకి ప్రభాస్‌ పార్టీ ఎందుకో?

By:  Tupaki Desk   |   22 July 2015 11:02 PM IST
మీడియాకి ప్రభాస్‌ పార్టీ ఎందుకో?
X
బాహుబలి 350 కోట్లు వసూలు చేసింది. ఇంత పెద్ద సక్సెస్‌ సాధించినందుకు.. కనీస మాత్రంగానైనా చానెళ్లకు ఒక్క వాణిజ్య ప్రకటన కూడా ఇవ్వలేదని తెలుగు మీడియా ఈ సినిమా నిర్మాతల ప్రవర్తనతో హర్టయ్యింది. సినిమా ప్రారంభం నుంచి ఇది మాది అని నెత్తిన వేసుకుని ప్రచారం చేసినందుకు తగిన శాస్తి జరిగిందంటూ ఫీలయ్యారు.

కట్‌ చేస్తే.. మొన్నటి సాయంత్రం ప్రభాస్‌ హైదరాబాద్‌ లోని ఒక ప్రముఖ హోటల్‌ లో ఒక పార్టీ ఇచ్చాడు. అసలు ఈ యాడ్లు గోలేంటో నాకు తెలియదు అన్నట్లు మీడియా కావాలి, మీడియా మిత్రులతో స్నేహం కావాలి అన్నచందాన మనోడు పార్టీ ఏర్పాటు చేశాడు. యాడ్లు, ప్రకటనలు అనేవి నిర్మాతల పార్ట్‌ కాబట్టి, ప్రభాస్‌ కు దానితో సంబంధం లేదు అనుకుంటూనే చాలామంది ఈ పార్టీకి విచ్చేశారు. మీడియాతో మంచి రిలేషన్‌ కోసం జర్నలిస్టులను పిలిచి ఓ చిన్న సైజులో పార్టీ ఇచ్చి ఖుషీ చేయాలనేదే ప్లాన్‌. కాకపోతే ఇక్కడే ఓ పంచ్‌ వినిపిస్తోంది.

ఒక ప్రక్కన కనీసం ఒక్క చిన్న యాడ్‌ కూడా ఇవ్వకుండా 350 కోట్లు గ్రాస్‌ కలెక్షన్‌ వసూలు చేసేసుకొని, ఇలా ఓ చిన్న పార్టీతో జనాలను సవర తీసేద్దాం అనుకున్నాడా అంటూ చాలామంది అదే పార్టీలో విమర్శించేశారు. ఇక మరో ట్విస్ట్‌ ఏంటంటే.. అసలు ప్రభాస్‌ ఈ పార్టీకి రానేలేదు. అప్పటికే యూరప్‌ పయనం హడావుడి వల్ల రాలేకపోయాడని టాక్‌. ఏదేమైనా డార్లింగ్‌ మీడియాను బాగానే మ్యానేజ్‌ చేస్తున్నాడోచ్‌!!