Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ తో హ్యాట్రిక్ ఛాన్స్

By:  Tupaki Desk   |   25 Feb 2020 10:30 AM IST
పాన్ ఇండియా స్టార్ తో హ్యాట్రిక్ ఛాన్స్
X
వ‌రుస‌గా రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టి అంద‌రి క‌ళ్ల‌లో ప‌డ్డాడు వెంకీ కుడుముల‌. ఛ‌లో- భీష్మ బ్యాక్ టు బ్యాక్ బంప‌ర్ హిట్లు కొట్టేయ‌డంతో అత‌డి పేరు ఇంటా బ‌య‌టా మార్మోగుతోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శిష్యుడిగా త‌న‌కంటూ ఒక రేంజ్ ఉంద‌ని నిరూపించాడు వెంకీ. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో ఫుల్ స్వింగులో ఉన్న ఈ యంగ్ డైరెక్ట‌ర్ కోసం ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు అగ్ర క‌థానాయ‌కులు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్ప‌టికే ప్ర‌ఖ్యాత యు.వి.క్రియేష‌న్స్ సంస్థ వెంకీ వినిపించిన లైన్ కి ఓకే చెప్పింద‌ట‌. ఆ లైన్ ప్ర‌భాస్ కి కూడా న‌చ్చింద‌ని పూర్తి స్థాయి స్క్రిప్టును రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. శౌర్య‌కి ఛ‌లో.. నితిన్ కి భీష్మ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చి కెరీర్ కి పెద్ద సాయం అయ్యాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ నే డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. వెంకీకి ఇదో ఛాలెంజ్ అన్న టాక్ వినిపిస్తోంది.

బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం జాన్ (ప్ర‌భాస్ 20) పాన్ ఇండియా రేంజులోనే తెర‌కెక్కిస్తున్నారు. రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో యువి సంస్థ‌తో క‌లిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాని బ‌హుభాష‌ల్లో ఎంతో ఛాలెంజింగ్ గా నిర్మిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వెంకీ డార్లింగ్ ని పాన్ ఇండియా లెవ‌ల్లోనే చూపించాల్సి ఉంటుంది. ప్ర‌భాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా అన్ని భాష‌ల ఆడియెన్ కి స‌రిప‌డే రేంజు స్క్రిప్టు ను యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ తో రూపొందించాల్సిందే. అయితే వెంకీ ఆ ఛాలెంజ్ ని తీసుకుంటాడా? అత‌డు తెర‌కెక్కించిన తొలి రెండు చిత్రాలు ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీస్.. ఫ‌న్ ఎలిమెంట్ తో కూడుకున్న లైట‌ర్ వెయిన్ స్టోరీస్.. మ‌రి హ్యాట్రిక్ కోసం ఎలాంటి క‌థ‌ను నేరేట్ చేస్తాడు? అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌భాస్ తో మూవీ అంటే భారీ బ‌డ్జెట్ కి సంబంధించిన టాస్క్ కాబ‌ట్టి వెంకీకి ఇదో స‌వాల్ అనే భావించాల్సి ఉంటుంది.