Begin typing your search above and press return to search.
`పుష్ప` పాన్ ఇండియా ప్రమోషన్స్ కి ప్రభాస్!
By: Tupaki Desk | 30 Nov 2021 8:46 AM ISTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వం వహిసస్తున్న చిత్రం-`పుష్ప: ది రైజ్`. రష్మిక మందన్న కథానాయిక. పుష్పలో సునీల్- అనసూయ భరద్వాజ్- ఫహద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే పాటలతో పుష్పకు కావాల్సినంత ప్రమోషన్ దక్కింది. బన్ని మాస్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది.
తాజాగా ప్రమోషన్స్ పరంగా హైప్ పెంచేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. డిసెంబర్ 12న ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. వేదిక - సమయం పూర్తి వివరాలను నిర్మాతలు త్వరలో తెలియజేయనున్నారు.
పుష్పతో బన్ని తదుపరి స్థాయి స్టార్ డమ్ ను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. మొదటి భాగం `పుష్ప: ది రైజ్` 17 డిసెంబర్ 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ తో హైప్ పెంచనున్నారు. అన్ని భాషల్లో పాపులారిటీని ఆస్వాధించే ఏకైక స్టార్ ప్రభాస్ అండదండలు ఈ సినిమాకి ప్లస్ కానున్నాయి . ప్రీరిలీజ్ వేదికపై ప్రభాస్ ప్రచారం కలిసి రానుంది. పుష్ప చిత్రం తెలుగు- తమిళం- హిందీ- మలయాళం- కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. హిందీలో బన్నికి ఇది అత్యంత భారీ రిలీజ్ కానుంది.