Begin typing your search above and press return to search.
బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి పెట్టిన ప్రభాస్..!
By: Tupaki Desk | 11 May 2021 7:00 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ''ఆదిపురుష్''. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఇప్పటికే ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో సుమారు 60 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. కరోనా కారణంగా అక్కడ షూటింగ్ కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పెరగకుండా హీరో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
'ఆదిపురుష్' షూటింగ్ ప్లాన్స్ అన్నీ చేంజ్ చేయడంతో దీనికి అదనంగా ఖర్చు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చిత్ర యూనిట్ కి ప్రభాస్ సూచనలు ఇస్తున్నారట. షూటింగ్ షిఫ్ట్ అవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాతలకు భారంగా మారకూడదని దర్శకుడితో ప్రభాస్ చెప్పినట్లు టాక్. నిజానికి షూటింగ్ ఒకచోట నుంచి మరో చోటుకు మారిస్తే కచ్చితంగా కొంత మేర బర్డెన్ పడుతుంది. అందుకే ప్రభాస్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటున్నారట. హైదరాబాద్ లో సుమారు మూడు నెలల పాటు ఈ సినిమా షూట్ జరగనుందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.