Begin typing your search above and press return to search.
బాహుబలి భయపెట్టిందంటున్న ప్రభాస్
By: Tupaki Desk | 13 April 2017 7:11 PM ISTరాజమౌళి అన్నట్లుగా ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా కోసం తన కెరీర్లో నాలుగేళ్ల సమయాన్ని ఇస్తాడా? ఐతే ప్రభాస్ ఇచ్చాడు. బాహుబలి సినిమాకే నాలుగేళ్ల పాటు అంకితమైపోయాడు. ఈ కాలంలో అతను ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చో. ఎంత డబ్బు సంపాదించి ఉండొచ్చో. కానీ బాహుబలి లాంటి సినిమా కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించినందుకు తనకు ఎంత మాత్రం బాధ లేదంటున్నాడు ప్రభాస్.
బాహుబలి కోసం కేటాయించిన నాలుగేళ్లలో 8 సినిమాలు చేసుకుని ఉండొచ్చని కొందరన్నారని.. ఎనిమిది కాదు ఇంకో ఎనిమిది కలుపుకుని 16 సినిమాలు చేసి ఉన్నా బాహుబలి వల్ల వచ్చిన గుర్తింపు ముందు తక్కువే అనిపిస్తుందని... ఈ సినిమా కోసం చేసిన జర్నీ ఎప్పటికీ మర్చిపోలేనిదని ప్రభాస్ అన్నాడు. తన జీవితాన్ని పుస్తకంగా రాసుకుంటే అందులో 30 శాతం బాహుబలి గురించే ఉంటుందని ప్రభాస్ చెప్పాడు.
బాహుబలి విషయంలో తనను అత్యంత టెన్షన్ పెట్టిన విషయం గురించి చెబుతూ.. ‘‘ఈ సినిమా కోసం శారీరకంగా.. మానసికంగా చాలా కష్టపడ్డాం. షూటింగ్ సమయంలో బడ్జెట్ సంగతులే నన్ను అన్నిటికన్నా ఎక్కువగా కంగారు పెట్టేది., ఎక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుందో అని భయపడేవాళ్లం. అందుకే చాలా భాద్యతగా.. క్రమశిక్షణగా స్కూలుకు వెళ్లినట్టు షెడ్యూల్ ప్రకారం నడుచుకునేవాళ్లం’’ అని ప్రభాస్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/