Begin typing your search above and press return to search.
ప్రభాస్ కాస్త ఫీలయ్యాడా???
By: Tupaki Desk | 12 July 2015 4:58 PM ISTబాలీవుడ్‌లో బాహుబలి బాగా ఆగడేస్తోంది. అక్కడ సండే కూడా 100% ఆక్యుపెన్సీతో ఇరగదీస్తోంది. సండే కలెక్షన్లు ఠారెత్తిపోయే సీన్ అంటున్నారు ఫిలిం ట్రేడ్ పండితులు. అయితే బాలీవుడ్ జనాబా, పెద్దపెద్ద సినిమా స్టార్ల నుండి సోషలైట్ల వరకు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించేటప్పుడు ఒకటి మిస్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ప్రభాస్‌ను కాస్త ఇరకాటంలో పడేస్తోంది. పదండి ఓ లుక్కేద్దాం.
నిజానికి బాలీవుడ్‌లో బాహుబలిని పొగిడేసిన ప్రతీ టాప్ క్రిటిక్ కూడానూ ప్రభాస్‌ను మెచ్చేసుకున్నాడు. అయితే ప్రభాస్ కంటే ఎక్కువ మార్కులు మాత్రం రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ కొట్టేశారని చెప్పేశారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయానికొస్తే.. పెద్ద పెద్ద వారు కూడా రానా దగ్గుబాటి చించేశాడని సెలవిచ్చారు. బహుశా మనోడికి అక్కడున్న కాంటాక్ట్స్ వలనో కాని.. అందరూ రానా కే మార్కులు ఎక్కువ వేశారు. సల్మాన్ వంటి పెద్దలు కూడా రానా, రాజమౌలి అనే రెండు పేర్లనే చెప్పుకొచ్చాడు.
ఇలాంటివన్నీ చూసి ప్రభాస్ కాస్త ఫీలవుతున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. ఇంతా కష్టపడి మూడు సంవత్సరాలు సినిమా చేస్తే.. సినిమాలో తనకంటే ఎక్కువగా డైరక్టర్, విలన్ రానా బాగా హైలైట్ అయిపోవడం పట్ల కాస్త షాకయ్యాడట. అయితే ఈ సబ్జెక్టు అలాంటిది మరి. సో, ప్రభాస్ లైట్ తీస్కొని సెకండ్ పార్టుతో వచ్చేస్తే.. బాహుబలి ఎందుకు చనిపోయాడు అనే యాంగిల్‌తో జనాలకు ఫుల్ కిక్కిస్తుందిలే.