Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ హాలీడే ఫేవ‌రేట్ స్పాట్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   25 July 2022 6:31 AM GMT
ప్ర‌భాస్ హాలీడే ఫేవ‌రేట్ స్పాట్ ఏంటో తెలుసా?
X
టాలీవుడ్ స్టార్ హీరోలు గ‌త కొంత కాలంగా వ‌రుస షూటింగ్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. క‌రోనాకు ముందు షూటింగ్ లు పూర్తి కాగానే న‌చ్చిన స్పాట్ కి, ప్లేస్ కి లేదా కంట్రీ వెళ్లిపోయి అక్క‌డ స‌ద‌గా గ‌డిపేయ‌డం.. అక్క‌డ వీధుల్లో ఫ్రీ మ్యాన్ లా అంద‌రితో క‌లిసి పో యి విహ‌రించ‌డం చేస్తుంటారు. ఇక పెళ్లైన హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న‌ షూటింగ్ పూర్త‌యిందా వెంట‌నే ఫ్యామిలీతో వెకేష‌న్ కి వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీతో క‌లిసి విదేశాల్లో విహ‌రిస్తూ ఆ మ‌ధుర క్ష‌ణాల‌ని ఆస్వాదిస్తుంటారు.

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ కూడా ఈ మ‌ధ్య వైఫ్ ఉపాస‌న కార‌ణంగా వెకేష‌న్ కి విదేశాల్లో విహ‌రిస్తూ ఆ మ‌ధురానుభూతుల‌ని అభిమానుల‌తో పంచుకుంటున్నారు. ప‌లు ఫొటోల‌ని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మాత్రం త‌న వెకేష‌న్ టూర్ కి సంబంధించిన విశేసాల‌ని మాత్రం ఫ్యాన్స్ తో పంచుకోవ‌డం లేదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. షూటింగ్ లు పూర్త‌వ‌గానే ప్ర‌భాస్ విదేశాల‌కు వెళ్లిపోతున్నారు.

త‌న‌కు నచ్చిన దేశంలోని న‌చ్చిన స్పాట్ కి వెళ్లి అక్క‌డే ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఇంత‌కీ మ‌న పార్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వెకేష‌న్ కి వెళుతోంది ఎక్క‌డికి? ఆయ‌నకు అత్యంత న‌చ్చిన ఫేవ‌రేట్ స్పాట్ ఏంటీ? ఇంత‌కీ ఆయ‌న ఏ దేశం వెళుతున్నారు? అన్న‌ది ఇప్పుడు అస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌భాస్ షూటింగ్ లు వున్న‌ప్పుడు మాత్ర‌మే ఇండియాలో వుంటున్నారు. షూటింగ్ లు ప్యాక‌ప్ అన‌గానే ఇట‌లీ వెళ్లిపోతున్నార‌ట‌.

అక్క‌డి ఫేవ‌రేట్ స్పాట్ లో ఓ లావీష్ విల్లాని రెండ్ కి తీసుకున్న ప్ర‌భాస్ మిగ‌తా స‌మ‌యాల్లో అక్క‌డే వుంటూ ఓ సాధ‌ర‌ణ యువ‌కుడిగా అక్క‌డి రోడ్ల‌పై విహ‌రిస్తూ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్స‌న్ ' ప్రాజెక్ట్ కె'. నాగ్ అశ్విన్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవ‌లే పూర్త‌యింద‌ట‌. దీంతో ప్ర‌భాస్ విశ్రాంతి కోసం ఇట‌లీ వెళ్ల‌డానికి రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాతీయ పుర‌స్కారాల్లో 'ఆదిపురుష్' ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రూపొందించిన 'తానాజీ' చిత్రానికి మూడు విభాగాల్లో అవార్డులు ద‌క్కాయి. మ‌రాఠీలో 'లోక‌మాన్య ఏక్ యుగ్ పురుష్' పేరుతో రూపొందిన సినిమాతో తొలిసారి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ఓం రౌత్ ఆ త‌రువాత హిందీలో 'తానాజీ' మూవీతో అరంగేట్రం చేశారు. ఈ మూవీకి మూడు జాతీయ పుర‌స్కారాలు ద‌క్కిన నేప‌థ్యంలో హీరో ప్ర‌భాస్ ఈ చిత్ర బృందానికి ప్ర‌త్యేకంగా పార్టీ ఇవ్వ‌బోతున్నార‌ట‌.

ఈ పార్టీని ప్ర‌భాస్ హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయ‌బోతుండ‌టంతో 'తానాజీ' టీమ్ అంతా ఇక్క‌డికే రాబోతున్నార‌ని తెలిసింది. పార్టీ త‌రువాతే ప్ర‌భాస్ ఇటలీ వెళ్ల‌నున్నార‌ట‌. తిరిగి వ‌చ్చాక 'స‌లార్' షూటింగ్ లో పాల్గొంటార‌ని చెబుతున్నారు.