Begin typing your search above and press return to search.

యంగ్ రెబ‌ల్ స్టార్ ని వ‌ద‌ల బొమ్మాళీ

By:  Tupaki Desk   |   11 Dec 2020 11:10 AM GMT
యంగ్ రెబ‌ల్ స్టార్ ని వ‌ద‌ల బొమ్మాళీ
X
`బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ స్థాయి అమాంతం మారిపోయింది. ఆయ‌న సినిమాల మార్కెట్ స్కై హైకి చేరింది. దీంతో ప్ర‌భాస్ ప్ర‌తీ విష‌యంలోనూ జాతీయ స్థాయిలో చ‌ర్చ‌ల్లోకొస్తున్నాడు. ఆయ‌న సినిమాలైనా .. వ్య‌క్తిగ‌త విష‌యాలైన దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌తో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ప్ర‌భాస్ ఫామ్ హౌస్ వివాదం గురించి తెలిసిందే. ఇది మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

గ‌తంలో న‌గ‌ర శివారులో వున్న ప్ర‌భాస్ ఫామ్ హౌస్ వివాదం కోర్టు గ‌డ‌ప వ‌ర‌కూ వెళ్లింది. న‌గ‌ర పాల‌క సంస్థ దీనిపై ప్ర‌భాస్ ‌కు నోటీసులు కూడా ఇవ్వ‌డం.. ఈ వివాదం హైకోర్టు దాకా వెళ్ల‌డంతో ఫామ్ హౌస్ ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిచింది. ఇటీవ‌ల దీనికున్న అడ్డంకుల్నీ తొల‌గిపోవ‌డంతో ప్ర‌భాస్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మ‌రోసారి ప్ర‌భాస్ ఫామ్ హౌస్ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ సారి టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో క్రేజీ టాపిక్ గా మారింది.

న‌గ‌ర శివార్ల‌లో ప్ర‌భాస్ ఫామ్ హౌస్ విలువ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇప్ప‌టికే దీని విలువ 60 కోట్ల‌ని తెలుస్తోంది. అక్క‌డ వున్న భూమిలో పంట‌లు పండించ‌డం.. చుట్టూ అహ్ల‌ద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో మెక్క‌ల్ని నాట‌డం చేస్తుంటారు. ఇప్పుడిది బాలీవుడ్ మీడియాలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ట‌. స‌క‌ల సౌక‌ర్యాల‌తో అందంగా తీర్చిదిద్దిన ప్ర‌భాస్ ఫామ్ హౌస్ 60 కోట్లు వుంటుంద‌ని బాలీవుడ్ మీడియా ప్ర‌త్యేక క‌థ‌నం వేయ‌డంతో జాతీయ స్థాయిలో ఆ సంగ‌తి అంద‌రికీ తెలిసొచ్చింది.