Begin typing your search above and press return to search.

టీజర్‌ రాకుంటే ఊరుకోరేమో!

By:  Tupaki Desk   |   11 Oct 2020 10:53 AM GMT
టీజర్‌ రాకుంటే ఊరుకోరేమో!
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు దగ్గరకు వచ్చేసింది. అభిమానులు మరియు ప్రేక్షకులు ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయన నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించిన కీలక అప్‌ డేట్లు వస్తాయంటూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నటిస్తున్న రాధేశ్యామ్‌.. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కాబోతున్న ఆదిపురుష్‌ మరియు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలకు సంబంధించి రాబోతున్న అప్‌ డేట్స్‌ మరియు ఇతర బర్త్‌ డే సర్‌ ప్రైజ్ ల కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాధేశ్యామ్‌ నుండి టీజర్‌ ను ప్రభాస్‌ అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఆ విషయమై క్యాపెయిన్‌ మొదలయ్యింది.

యూవీ క్రియేషన్స్‌ వారు రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషన్‌ విషయంలో నిద్ర పోతున్నారా అంటూ అభిమానులు గతంలో సోషల్‌ మీడియాలో వారిని బ్యాన్‌ చేయాల్సిందే అంటూ ప్రభాస్‌ అభిమానులు తీవ్ర స్థాయిలో నిర్మాణ సంస్థను విమర్శించారు. ఆ ఒత్తిడితో రాధేశ్యామ్‌ సినిమా టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేయడం జరిగింది. రాధేశ్యామ్‌ టీజర్‌ కోసం ప్రస్తుతం ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభాస్‌ బర్త్‌ డేకు ఒక వేళ టీజర్‌ కనుక విడుదల చేయకుంటే ఖచ్చితంగా మరోసారి యూవీ క్రియేషన్స్‌ వారిపై ఫ్యాన్స్‌ నిప్పులు చెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం యూరప్‌ లో చిత్రీకరణలో ఉన్న సినిమా యూనిట్‌ సభ్యులు టీజర్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.