Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ని లాట‌రీ స్టార్ అనేసిన బ‌న్ని ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   24 Jan 2022 2:56 AM GMT
ప్ర‌భాస్ ని లాట‌రీ స్టార్ అనేసిన బ‌న్ని ఫ్యాన్స్
X
సోష‌ల్ మీడియాల్లో స్టార్ల అభిమానుల మ‌ధ్య వార్ గురించి తెలిసిన‌దే. ఇత‌ర హీరోల్ని విమ‌ర్శించేందుకు ఫ్యాన్స్ వెన‌కాడడం లేదు. ఇటీవ‌లి పుష్ప‌- ది రైజ్ సక్సెస్ అనంత‌రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రభాస్ ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. దీనికి ప్ర‌భాస్ అభిమానులు అంతే ధీటైన స‌మాధానాలిస్తున్నారు.

ఇంత‌కీ బ‌న్ని ఫ్యాన్స్ ప్ర‌భాస్ ని ఏమ‌ని విమ‌ర్శించారు? అంటే.. అత‌డు లాట‌రీ స్టార్ అని బ‌న్ని రియ‌ల్ స్టార్ అని విమ‌ర్శిస్తున్నారు. పుష్ప: ది రైజ్ హిందీలోనూ భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. అది అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ని లాటరీ స్టార్ అంటూ ఎగతాళి చేస్తున్నారు. బాహుబలితో ప్రభాస్ అదృష్టవంతుడయ్యాడ‌ని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. అల్లు అర్జున్ ని ప్ర‌భాస్ తో పోల్చినప్పుడు అతను మంచి డ్యాన్సర్.. నటుడు... పూర్తి ఆల్ రౌండర్ కాబట్టి రియ‌ల్ స్టార్ అని బ‌న్ని ఫ్యాన్స్ అంటున్నారు. బాహుబలికి ముందు ఉత్తర భారతదేశంలో ప్రభాస్ కు ఎటువంటి గుర్తింపు లేదని జాక్ పాట్ కొట్టి అకస్మాత్తుగా పాన్ ఇండియా స్టార్ డమ్ ను పొందాడని.. అందుకు రాజమౌళికి ధన్యవాదాలు అని బ‌న్ని ఫ్యాన్స్ అంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్- ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ లాటరీ స్టార్ అని వాదించగా.. హిందీ బెల్ట్ లో అల్లు అర్జున్ చిత్రాల జీవితకాల కలెక్షన్ల కంటే ప్రభాస్ చిత్రానికి ఓపెనింగ్స్ పెద్దవిగా ఉన్నాయని.. మీరే చెక్ చేసుకోవాల‌ని ప్రభాస్ అభిమానులు అంటున్నారు. ప్రభాస్ నిజంగా లాటరీ స్టార్ అయితే సాహో లాంటి ఫ్లాప్ సినిమా హిందీ సర్క్యూట్ లో ఇంత విపరీతమైన వ్యాపారం చేసి ఉండేది కాదని విశ్లేషిస్తున్నారు. నిజానికి బాహుబ‌లి వ‌ల్ల‌నే ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి విశ్వ‌విఖ్యాతం అవుతోంది. దీనికి ప్ర‌భాస్ - రాజ‌మౌళి దారి చూపించారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సోష‌ల్ మీడియా ల్లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ వార్ గ‌తంలో ఇలానే హీటెక్కించిన సంగ‌తి తెలిసిందే.