Begin typing your search above and press return to search.

'స‌లార్' ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారా?

By:  Tupaki Desk   |   25 April 2022 8:00 AM IST
స‌లార్ ఫ్యాన్స్ కూడా రెడీ అవుతున్నారా?
X
భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియ చిత్రం `రాధేశ్యామ్` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించిందో తెలిసిందే. సినిమా ఫ‌లితంతో డార్లింగ్ ప్ర‌భాస్ స‌హా అభిమానులు ఎంతో నిరుత్సాహానికి గుర‌య్యారు. `సాహో` త‌ర్వాత మ‌రో ప‌రాజయం డార్లిగ్ ని బాగానే ఇబ్బంది పెట్టింది. స‌క్సెస్ అనివార్య‌మైన స‌మ‌యం ఆసన్న‌మైంది. ప్ర‌స్తుతం `కేజీఎఫ్` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో `స‌లార్` అనే భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి.

అస‌లే ఇటీవ‌లే రిలీజ్ అయిన `కేజీఎఫ్-2` భారీ విజ‌యం సాధించ‌డంతో `స‌లార్` పై అంచ‌నాలు ఆకాశ‌న్నంటుతున్నాయి. ప్ర‌భాస్ లాంటి క‌టౌట్ తో `కేజీఎఫ్` ని మించి హిట్ తీసి చూపించాల‌ని ప్ర‌భాస్ అభిమానులు కోరుతున్నారు. ఇదే స‌మ‌యంలో డార్లింగ్ అభిమానులు కూడా `స‌లార్` అప్ డేట్స్ ఏవి రావ‌డం లేద‌ని నిరుత్సాహానికి గుర‌వుతున్నారుట‌. సినిమా ప్రారంభ‌మై రెండేళ్లు పూర్త‌యింది. దాదాపు 75 శాతం షూటింగ్ పూర్త‌యింది.

అయినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ల లేదు. కొత్త పోస్ట‌ర్ల హంగామా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్ డేట్స్ కూడా అధికారికంగా ఎక్క‌డా రివీల్ చేయ‌లేదని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారుట‌. సోష‌ల్ మీడియాలో ఇంకా ఎటాకింగ్ మొద‌ల‌వ్వ‌లేదు గానీ..స‌మ‌యాత్తం అవుతున్న‌ట్లు సంకేతాలు అందుతున్నాయి. మే తొలి వారంలో `స‌లార్` త‌దుప‌రి షెడ్యూల్ మొద‌ల‌వుతుంద‌ని.. అదే నెల్లో టీజ‌ర్ రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు.

ఒక‌వేళ అప్ప‌టిలోగా అలాంటీ ట్రీట్ ఏది లేక‌పోతే అభిమానులు సోషల్ మీడియా వేదిక‌గా ఎటాకింగ్ దిగే అవ‌కాశం ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఈ విష‌యంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో తెలిసిందే. కొరటాల తో త‌న 30వ సినిమా మొద‌ల‌వుతుంద‌ని చెప్ప‌డం త‌ప్ప ప‌ట్టాలెక్కిన దాఖ‌లాలేదు. దీంతో ఫ్యాన్స్ మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా అభిమానులు నుంచి `స‌ర్కారు వారి పాట` విష‌యంలోనూ ఇలాంటి విమ‌ర్శ‌లే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.