Begin typing your search above and press return to search.
'రాధేశ్యామ్' మేకర్స్ పై మరోసారి డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్..!
By: Tupaki Desk | 22 Feb 2022 10:41 AM GMTప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ అనొచ్చు. ఎందుకంటే అతని స్నేహితులైన వంశీ కృష్ణా రెడ్డి - ఉప్పలపాటి ప్రమోద్ ఈ ప్రొడక్షన్ హౌస్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో 'మిర్చి' 'సాహో' వంటి సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం కృష్ణం రాజు సమర్పణలో ''రాధే శ్యామ్'' చిత్రాన్ని భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు.
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ - పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా ''రాధే శ్యామ్'' సినిమా తెరకెక్కుతోంది. కరోనా పాండెమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ కాబడిన ఈ మూవీ 2022 మార్చి 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే రిలీజ్ కు మూడు వారాల సమయమే ఉన్నా.. మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ చూపించడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రమోషన్స్ ను నిర్లక్ష్యం చేయడంతో పాటు సినిమా గురించి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో 'రాధే శ్యామ్' మేకర్స్ యూవీ క్రియేషన్స్ పై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం లేదంటూ.. #BoycottUVCreations అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.
'రాధే శ్యామ్' సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇంకా రెండు పాటలు విడుదల కావాల్సి ఉంది. అలానే థియేట్రికల్ ట్రైలర్ రావాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి ఇతర ఇండస్ట్రీలలో ప్రత్యేకంగా ప్రెస్ ఈవెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు వీటికి సంబంధించి మేకర్స్ సైడ్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులు 'రాధేశ్యామ్' సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల నిర్వహించిన వాలెంటైన్ ఈవెంట్ తో వారు సంతోషంగా లేరని తెలుస్తోంది. ఏదైనా ఎగ్జైటింగ్ కంటెంట్ వదిలి దూకుడుగా ప్రమోషన్స్ చేయాలని వారు కోరుకుంటున్నారు. ప్రభాస్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పీరియాడికల్ లవ్ స్టోరీన జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు చేయమని అంటున్నారు.
నిజానికి 'రాధే శ్యామ్' సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచే అప్డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ఫైర్ అవుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో నిర్మాతల మీద నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో అనేక సార్లు ట్రెండ్ చేశారు. ఇప్పుడు మరోసారి ట్రోలింగ్ చేస్తూ బాయ్ కాట్ యువీ క్రియేషన్స్ అని ట్రెండ్ మొదలు పెట్టారు. అత్యంత చెత్త ప్రొడక్షన్ హౌస్ అని.. ప్రభాస్ కెరీర్ ని నాశనం చేయడానికే ఉన్నారని ప్రభాస్ అభిమానులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇన్సైడ్ టాక్ ప్రకారం రాబోయే రోజుల్లో అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి 'రాధే శ్యామ్' మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను కూడా కట్ చేశారట. మార్చి 2 లేదా 3వ తేదీలలో ముంబై లో జరగబోయే గ్రాండ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారని సమాచారం. అంతేకాదు సినిమాలోని ఈ గ్యాప్ లో మరో పాటను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి చిత్ర నిర్మాతలపై కోపంతో ఉన్న ఫ్యాన్స్ ని ఈ ప్రమోషనల్ ప్లాన్స్ తో శాంతింపజేస్తాతారేమో చూడాలి.