Begin typing your search above and press return to search.
ఫోర్బ్స్ పత్రికలో ప్రభాస్ స్టోరీ
By: Tupaki Desk | 27 July 2015 8:46 AM GMTరాజమౌళితో సినిమా అంటే హీరోకు క్రెడిట్ ఏమీ రాదని.. అంతా డైరెక్టర్ కే వెళ్లిపోతుందని అంటుంటారు. బాహుబలి సినిమా విషయంలోనూ అదే జరుగుతున్నట్లు అనిపించడంతో ప్రభాస్ అభిమానులు కొంచెం ఫీలైన మాట వాస్తవమే. ఐతే కొంచెం ఆలస్యమైతే అయ్యింది కానీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ పేరే మార్మోగిపోతోంది. ఓవైపు జాతీయ పత్రికలు, టీవీల్లో ఇంటర్వ్యూ లు.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తో మీటింగ్.. ఇవన్నీ ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయేలా చేస్తున్నాయి. ఇంతలోనే ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా ప్రభాస్ గురించి ఓ స్టోరీ వేసి.. యంగ్ రెబల్ స్టార్ అభిమానుల్ని ఆనంద పరవశంలో ముంచెత్తింది.
ఇటీవలే బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్ మీద ఫోర్బ్స్ పత్రికలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కూడా ఫోర్బ్స్ లోకి ఎక్కాడు. ఊరికే పరిచయం చేస్తున్నట్లు కాకుండా మనోడి మీద ఓ రేంజిలో ప్రశంసలు కురిపించింది ఫోర్బ్స్. ప్రధాని మోదీ తన పనులన్నీ పక్కనబెట్టి మీట్ అయిన, ట్వీట్ చేసిన హీరో ఇతనంటూ పరిచయం చేసి.. ప్రఖ్యాత హాలీవుడ్ హీరోలు హారిసన్ ఫోర్డ్, ఎలిజా వుడ్ లతో పోలిక పెట్టింది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎలా మారుమోగిపోతోందో ఫోర్బ్స్ పత్రిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ కథనం చూసి మనోడి రేంజి ఏ స్థాయికి వెళ్లిపోయిందో అంటూ టాలీవుడ్ సెలబ్రెటీలంతా ట్విట్టర్లో సందడి చేస్తున్నారు. రాజమౌళి కూడా ఈ స్టోరీ మీద స్పందించాడు. హారిసన్ ఫోర్డ్ తో పోలిక పెట్టడం.. ఆ సౌండింగ్ తనకు బాగా నచ్చిందని రాజమౌళి పేర్కొన్నాడు.