Begin typing your search above and press return to search.
బాహుబలిపై ప్రభాస్ కి మళ్లీ మోజు
By: Tupaki Desk | 10 July 2017 11:02 PM ISTజూలై 10.. ఈ డేట్ స్పెషాలిటీ అందరికీ పెద్దగా గుర్తుండకపోవచ్చు కానీ.. బాహుబలి మూవీకి వర్క్ చేసిన ప్రతీ ఒక్కరికీ మాత్రం.. 2015 ఇదే రోజున బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయిన సంగతి గుర్తుంటుంది. ఇప్పుడు బాహుబలి మొదటి భాగం రిలీజ్ అయి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. మళ్లీ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటున్నాడు ప్రభాస్.
అప్పటివరకూ ఉన్న టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచేసి.. కొత్త రికార్డులకు తెర తీసిన బాహుబలి.. టాలీవుడ్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూసేలా చేయగలిగింది. మూడేళ్ల కష్టానికి మొదటి ఫలితాన్ని అందుకుని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రభాస్ ఓ స్పెషల్ మెసేజ్ ను పోస్ట్ చేశాడు. 'నాకు ఎంతో ప్రత్యేకమైన బాహుబలి ది బిగినింగ్ విడుదలయ్యి 2 ఏళ్లు పూర్తవుతోంది. నాకు నోస్టాల్జియా(వ్యామోహం) భావన కలుగుతోంది. షూటింగ్ ప్రారంభించిన తొలి రోజుల నుంచి ఈ సినిమాపై అందరూ ఎంతో ప్యాషన్ తో పని చేశారు. నాకు ఈ రోజును ఇంత ప్రత్యేకంగా చేసిన నా ప్రతీ అభిమానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. మొత్తం బాహుబలి టీంకి కంగ్రాచ్యులేషన్స్' అని చె్పాడు ప్రభాస్.
ఇలాంటి గొప్ప చిత్రరాజంలో తనను భాగం చేసినందుకు రాజమౌళికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాడు యంగ్ రెబల్ స్టార్. ఇంతగా ఫీల్ అవడానికి కారణం లేకపోలేదు.. అయితే.. బాహుబలి ది కంక్లూజన్ సక్సెస్ అవుతుందనే విషయం అందరికీ ముందే అర్ధమైంది. సక్సెస్ రేంజ్ మాత్రమే తర్వాత తెలిసింది. కానీ.. బాహుబలి ది బిగినింగ్ విషయానికి వస్తే.. రిలీజ్ తర్వాతి రోజు వరకూ బాహుబలి టీంతో తెగ టెన్షన్ పడిపోయారు. అదీ సంగతి.