Begin typing your search above and press return to search.

శర్వాను ప్రభాస్ వద్దన్నాడా?

By:  Tupaki Desk   |   25 Sept 2017 3:44 PM IST
శర్వాను ప్రభాస్ వద్దన్నాడా?
X
శర్వానంద్ అనగానే ఒకప్పుడు సీరియస్ క్యారెక్టర్లే గుర్తుకొచ్చేవి ఒకప్పుడు. వెన్నెల.. అందరి బంధువయా.. ప్రస్థానం లాంటి సినిమాలతో అతడికి సీరియస్ ఇమేజ్ వచ్చేసింది. ఐతే ‘రన్ రాజా రన్’ సినిమా ఆ ఇమేజ్ ను బ్రేక్ చేసేసింది. శర్వా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లలోనూ అదరగొట్టగలడని ఆ సినిమా రుజువు చేసింది. ఐతే అంతకుముందు శర్వాకు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ‘రన్ రాజా రన్’ సినిమాకు అతడు సరిపోడేమో అని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందేహించాడట. తన మిత్రులు వంశీ.. ప్రమోద్ ‘యువి క్రియేషన్స్’ బేనర్ మీద ‘రన్ రాజా రన్’ సినిమా తీయాలనుకున్నప్పుడు హీరోగా శర్వా పేరు చెబితే తాను సందేహించినట్లు ప్రభాస్ వెల్లడించాడు.

శర్వానంద్.. వంశీ-ప్రమోద్ ఇద్దరికీ మంచి మిత్రుడని.. వంశీనే ‘రన్ రాజా రన్’కు శర్వా పేరు చెప్పాడని.. కానీ సీరియస్ ఇమేజ్ ఉన్న అతను ఈ సినిమా చేయగలడా అని తాను సందేహాలు వ్యక్తం చేశానని ప్రభాస్ చెప్పాడు. కానీ వంశీ మాత్రం శర్వా ఈ క్యారెక్టర్ చేయగలడని చెప్పాడని.. ‘రన్ రాజా రన్’లో శర్వా చూపించిన యాటిట్యూడ్ సూపరని.. ఒక హీరో అలాంటి యాటిట్యూడ్ చూపించడం కష్టమని.. అందుకే ఆ సినిమా చూశాక తాను శర్వాకు ఫ్యాన్ అయిపోయానని అన్నాడు ప్రభాస్. ‘మహానుభావుడు’ సినిమాలో కూడా శర్వా సూపర్ గా కనిపిస్తున్నాడని.. భవిష్యత్తులో శర్వా సూపర్ స్టార్ అయిపోతాడని ప్రభాస్ వ్యాఖ్యానించాడం విశేషం.