Begin typing your search above and press return to search.
ప్రభాస్ డైరెక్టర్ కు కష్టాలు తగ్గడం లేదా?
By: Tupaki Desk | 25 Nov 2022 5:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ఓం రౌత్ కష్టాలు తగ్గడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ టైటిల్ పాత్రలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ 'ఆది పురుష్'. ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. టి. సిరీస్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న'ఆది పురుష్' టీజర్ రిలీజ్ కు ముందు భారీ హైప్ క్రియేట్ అయింది.
అది కాస్తా టీజర్ రిలీజ్ తరువాత తలకిందులైంది. టీజర్ రిలీజ్ కోసం యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే టీజర్ లో గ్రాఫిక్స్, ప్రభాస్ ని శ్రీరాముడిగా చూపించిన తీరు, హనుమంతుడి పాత్ర మేకోవర్.. ఇతర పాత్రలని చూపించిన విధానం.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ మేకోవర్ చూసిన వాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభాస్ లాంటి హీరోని పెట్టుకుని 'ఆదిపురుష్' కు ఇలాంటి గ్రాఫిక్సా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు.
చిత్ర బృందంపై విమర్శల దాడికి దిగారు. టీజర్ ఏ విషయంలోనూ ఇంప్రెసీవ్ గా లేదని మేకర్స్, మరీ ముఖ్యంగా డైరెక్టర్ పై నెటిజన్ లు సోషల్ మీడియా వేదికగా చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. జపనీస్ యానిమేటెడ్ ఫిల్మ్ ని స్ఫూర్తిగా తీసుకుని ఓం రౌత్ ఎంత పెద్ద తప్పు చేశాడో నెటిజన్ లు స్పష్టం చేశారు. అంతే కాకుండా చాలా లైట్ గా తీసుకుని ఈ మూవీని దర్శకుడు చేసినట్టుగా వుందని, ఆ కారణంగానే ఇండియన్ వెర్షన్ రామాయణంలా 'ఆది పురుష్' టీజర్ లేదని, ఏదో ఇతర దేశానికి చెందిన వాళ్లు..
మన పురాణాలపై పట్టులునటువంటి వాళ్లు తీసినట్టుగా వుందని దర్శకుడు ఓం రౌత్ పై దుమ్మెత్తిపోశారు. దీంతో మళ్లీ రీ వర్క్ చేయడం మొదలు పెట్టింది చిత్ర బృందం. అయితే దక్షిణాది ప్రేక్షకులు విమర్శలు గుప్పించడంగమనించిన ఉత్తరాది ప్రేక్షకులు చిన్న చిన్నగా 'ఆది పురుష్' టీమ్ పై విరుచుకుపడటం మొదలైంది. దీంతో చిత్ర బృందం ప్రస్తుత్ మరింత ఒత్తిడికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ డైరెక్టర్ ఓం రౌత్ కొత్త కష్టాలు మొదలయ్యాయని చెబుతున్నారు.
ఇటీవల విడుదల చేసిన 'హను మాన్' టీజర్ ఓ రేంజ్ లో వుండటం, గ్రాఫిక్స్ వర్క్ చేసినట్టుగా కూడా కనిపించకుండా కంటికి ఇంపుగా కనిపిస్తుండటంతో 'ఆది పురుష్' టీమ్‌పై మరింత ఒత్తిడి పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విమర్శల నేపథ్యంలో ఈ సారి అయినా ఆది పురుష్' టీమ్ జాగ్రత్త పడి ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.