Begin typing your search above and press return to search.
ప్రభాస్.. దీపికా మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
By: Tupaki Desk | 29 March 2021 10:00 AM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఆదిపురుష్ మరియు సలార్ సినిమాల కంటే ముందే ప్రకటించిన నాగ్ అశ్విన్ మూవీ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అద్భుతమైన సోషియో ఫాంటసీ కథతో వైజయంతి బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ ను జులై లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభాస్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే జంటగా అమితాబ్ ముఖ్య పాత్రలో నటించబోతున్న ఈ సినిమా లోని మెజార్టీ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్వహించబోతున్నారట. భారీ ఖర్చుతో ఫిల్మ్ సిటీలో సెట్టింగ్ లు వెయిస్తున్నారు. ఇప్పటికే ఆ పని జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. విజువల్ వండర్ గా సినిమా ను తీర్చి సిద్ధేందుకు గాను మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రప్పిస్తున్నాడట. వచ్చే ఏడాది చివరి వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.