Begin typing your search above and press return to search.

'సాహో' కరక్టేనంటున్న ప్రభాస్

By:  Tupaki Desk   |   16 April 2017 4:18 AM GMT
సాహో కరక్టేనంటున్న ప్రభాస్
X
ఇప్పుడు తాము చేయబోయే తదుపరి సినిమా కోసం యువి క్రియేషన్స్ వారు ''సాహో'' అనే టైటిల్ రిజష్టర్ చేయించారని.. మరి ఇది బాహుబలి సినిమాలోని డైలాగ్ కాబట్టి.. ఖచ్చితంగా ఇది ప్రభాస్ సినిమా పేరేనని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు స్వయంగా ఈ కండలవీరుడే సదరు సాహో గురించి సాహో అనేశాడు. లెటజ్ సీ.

తాను తదుపరి చేయబోయే సినిమా కూడా భారీ బడ్జెట్ తో మూడు బాషల్లో రూపొందుతోందని.. ఈ సినిమాకు 'సాహో' అనే టైటిల్ అనుకుంటున్నామని నార్త్ ఇండియాలో బాహుబలి 2 సినిమాను ప్రచారం చేస్తున్న ప్రభాస్ సెలవిచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా తాలూకు ఒక సర్పరైజ్ ను బాహుబలి 2 రిలీజ్ తో కలిపి ప్లాన్ చేసినట్లు కూడా చెప్పాడు. అయితే సాహో సినిమా టీజర్ రెడీ చేస్తున్నారని.. అది బాహుబలి 2 కంటే ఒక్క రోజు ముందు రిలీజ్ చేయబడుతుందని ఆల్రెడీ తెలిసిన సంగతే.

ఇకపోతే ఎప్పుడా ఎప్పుడా అనుకుంటుంటే.. ఎట్టకేలకు ప్రభాస్ అండ్ అనుష్క తెలుగులో కూడా ప్రమోషన్లు స్టార్ చేశారు. శనివారం కొన్ని టివి ఛానళ్ళకు వీడియో ఇంటర్యూ ఇచ్చిన ప్రభాస్ అనుష్క.. ఇప్పుడు ఎగ్రెసివ్ గా సినిమా రిలీజయ్యేవరకు అదే పనిలో ఉంటారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/