Begin typing your search above and press return to search.
ప్రభాస్ ప్లాన్ ఛేంజ్.. పార్ట్-2కి రెడీ
By: Tupaki Desk | 14 July 2015 9:03 PM IST200కోట్లు.. నాలుగే రోజుల్లో.. ఓ తెలుగు సినిమాకి ఈ రేంజు ఉంటుందని ఏనాడైనా ఊహించారా? కానీ ఇది సాధ్యమైంది. 300కోట్లు, 400కోట్లు కూడా సాధ్యమేనని నిరూపించడానికి ముందుకు దూసుకెళ్తోంది బాహుబలి. ఇది టాలీవుడ్ సినిమా అని గర్వంగా కాలరెగరేసి చెప్పుకోదగ్గ సినిమా. మన జక్కన్న చెప్పిన శిల్పం. అందుకే ప్రభాస్ ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. ముందుగా అనుకున్న ప్లాన్స్ అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు మైండ్‌లో ఒకటే ఆలోచన. ఈ విజయం ఇచ్చిన కిక్కులోనే బాహుబలి-2 పూర్తి చేస్తే పోలా. ఇదే ఆలోచనలో ఉన్నాడిప్పుడు.
అంతేనా జక్కన్న రెట్టించిన ఉత్సాహంతో బాహుబలి టీమ్‌ని సిద్ధం చేస్తున్నాడు. ప్రభాస్‌కి ఇప్పటికే చెప్పేశాడు. సెప్టెంబర్ నాటికి రెడీగా ఉండు. ముందస్తుగానే భారీ కసరత్తులు చేసి శరీరాన్ని భీకరంగా తయారు చెయ్. భారీ యుద్ధ సన్నివేశాలుంటాయ్! పార్ట్ -1ని కొట్టేయాలి.. అని చెప్పేశాడు. ఇక ప్రభాస్ సైతం దానికి సై అన్నాడు. అందుకే ఇంతకుముందు రిలీఫ్ కోసం ఓ చిన్న సినిమా చేయాలి అనుకున్నాడు. యువిక్రియేషన్స్‌లో స్నేహితుల కోసం చేస్తానన్న సినిమాని ఆపేశాడు. రన్ రాజా సుజిత్‌కి సారీ చెప్పేశాడు. ప్రస్తుతానికి ఆపండి. బాహుబలి-2 తర్వాత చూద్దాం అనేశాడు. ఏదేమైనా ఇక రణరంగానికి బాహుబలుడు ప్రభాస్ సిద్ధం. పండగ చేసుకోవడానికి మీరు సిద్ధమా?
