Begin typing your search above and press return to search.
డార్లింగ్ కి థ్యాంక్స్ చెప్పేసిన జక్కన్న
By: Tupaki Desk | 6 Jan 2017 11:27 AM ISTదర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి ది బిగినింగ్ ఎప్పుడు చూద్దామా అని ఆడియన్స్ ఎంత ఆత్రంగా ఉన్నారో.. ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ ఎప్పుడు ఫ్రీ అవుతాడా అని అంతే ఆతృతతో చూస్తున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. గత డిసెంబర్ చివరకే సినిమా షూటింగ్ అయిపోతుందన్నారు కానీ.. ఆ తర్వాత కూడా ఇంకా కొంత పార్ట్ షూట్ చేస్తున్నారు.
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. బాహుబలి షూటింగ్ నుంచి ప్రభాస్ కు రిలీఫ్ వచ్చేసింది. ప్రభాస్ తో చేయాల్సిన పార్ట్ మొత్తానికి షూటింగ్ అయిపోయింది. ఈ విషయం వేరేవరో కాదు.. స్వయంగా జక్కన్నే ప్రకటించాడు. 'ప్రభాస్ తో షూటింగ్ పూర్తయిపోయింది. 3.5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేశాం. థ్యాంక్స్ డార్లింగ్.. ఈ ప్రాజెక్టుపై నువ్వు నమ్మినంతగా వేరెవ్వరూ నమ్మకం ఉంచలేదు. అదే అన్నికంటే విలువైనది' అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.
ప్రభాస్ తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసినట్లు చెప్పిన నిర్మాత శోభు యార్లగడ్డ.. నమ్మలేకపోతున్నానని అన్నారు. ఇప్పుడు అధికారికంగా బాహుబలికి సంబంధించి షూటింగ్ అయిపోవడంతో.. ఇక డబ్బింగ్.. ప్రమోషన్స్ తప్ప బాహుబలి2కి ప్రభాస్ చేయగలిగింది ఏమీ ఉండదు. ఈలోపు సుజిత్ తో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం 20కిలోలు బరువు తగ్గే కష్టతరమైన టార్గెట్ నిర్ణయించుకున్నాడు ప్రభాస్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
