Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా కన్ఫ్యూజన్
By: Tupaki Desk | 5 Oct 2020 8:30 AM ISTకేజీఎఫ్ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డం దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు బాహుబలి సినిమాతో ఆల్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ లు ఇద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుగు మరియు కన్నడ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ వారు ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన మాట వాస్తవమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అంటున్నారు. కనుక వీరిద్దరి కాంబో మూవీ ఖచ్చితంగా రాబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నము్మతున్నారు. ఈ సమయంలో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో తెలుగు హీరో అయిన ఎన్టీఆర్ తో కూడా సినిమాను చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఉంటుంది అనేది ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ గా ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ఆ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తే అది కూడా బంపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. వీరిద్దరిది రియల్ పాన్ ఇండియా మూవీ అవుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు సైతం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీరిద్దరి కాంబో త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. 2021 చివరి వరకు ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు.
ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ ల మూవీస్ వచ్చే ఏడాదిలో పూర్తి అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అంటే వచ్చే ఏడాదిలో ప్రశాంత్ నీల్ మూవీ ని అధికారికంగా ప్రకటిస్తారా అనేది చూడాలి. అయితే మొదటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. కనుక ఆయనతో చేసిన తర్వాత ప్రభాస్ తో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తానికి ఏం జరుగబోతుంది అనేది ప్రభాస్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది.