Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అనడానికి ఇదే నిదర్శణం

By:  Tupaki Desk   |   23 Oct 2019 9:11 AM GMT
ప్రభాస్‌ ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అనడానికి ఇదే నిదర్శణం
X
బాహుబలి చిత్రంతో ఆల్‌ ఇండియా స్టార్‌ డం దక్కించుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రంతో మరోసారి బాలీవుడ్‌ రేంజ్‌ లో తన సత్తా చాటాడు. అందుకే ప్రభాస్‌ ను ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అంటూ అభిమానులు పిలుస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో.. సౌత్‌ ఇండియాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ప్రభాస్‌ కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆ విషయం మరో సారి నిరూపితం అయ్యింది.

నేడు ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ రోజు సోషల్‌ మీడియాలో మొత్తం కూడా ప్రభాస్‌ ప్రభాస్‌ అంటూ దద్దరిల్లి పోతుంది. జాతీయ స్థాయిలో హ్యాపీబర్త్‌ డే ప్రభాస్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా హైదరాబాద్‌ ఇంకా పలు నగరాల ట్విట్టర్‌ ట్రెండ్స్‌ ను పరిశీలించినా కూడా అన్నింట్లో కూడా హ్యాపీ బర్త్‌ డే ప్రభాస్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ టాప్‌ లో ఉంది. ప్రభాస్‌ స్టామినాకు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్‌ స్టార్స్‌ కు కూడా సాధ్యం కాని టాప్‌ ట్రెండ్స్‌ ప్రభాస్‌ కు సాధ్యం అయ్యేలా ఆయన ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్నారు.

ప్రభాస్‌ బర్త్‌ డే సందర్బంగా సినీ ప్రముఖులు పలువురు బర్త్‌ డే విషెష్‌ చెప్పారు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ స్పందిస్తూ.. హ్యాపీ బర్త్‌ డే ప్రభాస్‌ అన్న.. ఈ ఏడాది మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

వెన్నెల కిషోర్‌ ట్విట్టర్‌ లో.. డార్లింగ్‌ ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మళ్లీ మళ్లీ జరుపుకోవాలంటూ విషెష్‌ తెలియజేశాడు.

నిర్మాత బండ్ల గణేష్‌.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ టీం ప్రభాస్‌ కు బర్త్‌ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేసింది.

హీరోయిన్‌ ఛార్మి కౌర్‌.. యూనివర్శిల్‌ డార్లింగ్‌ మంచి స్నేహితుడు ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేసింది.

యూట్యూబ్‌ కూడా డార్లింగ్‌ ప్రభాస్‌ కు ట్విట్టర్‌ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇంకా పలువురు బాలీవుడ్‌.. టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు రాజకీయ మరియు మీడియా ప్రముఖులు ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అందరు హీరోల ఫ్యాన్స్‌ కూడా ప్రభాస్‌ కు సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో జాతీయ స్థాయిలో హ్యాపీ బర్త్‌ డే ప్రభాస్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

మా తరపున కూడా డార్లింగ్‌ అండ్‌ స్వీట్‌ పర్సన్‌ ప్రభాస్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.