Begin typing your search above and press return to search.

టెమ్ట్ చేస్తూ వ‌ల విసురుతున్న ప్ర‌భాస్ బ్యూటీ

By:  Tupaki Desk   |   23 Feb 2022 2:30 PM GMT
టెమ్ట్ చేస్తూ వ‌ల విసురుతున్న ప్ర‌భాస్ బ్యూటీ
X
పెళ్లి త‌రువాత గ్లామర్ షోకి గేట్లు తెరిచేసింది బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే. క్రేజీ స్టార్ ర‌ణ్ వీర్ సింగ్ ని వివాహం చేసుకుని అభిమానుల‌కు షాకిచ్చిన ఈ పొడుగుకాళ్ల సుంద‌రి పెళ్లి త‌రువాత మాత్రం గ్లామ‌ర్ షో చేస్తూ వ‌రుస షాకులిస్తోంది. దీపిక న‌టించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ `గెహ్ర‌యాన్` . ఈ చిత్రంలో స‌హ న‌టుడు సిద్ధాంత్ చ‌తుర్వేదితో హాట్ హాట్ రొమాన్స్ చేసి వార్త‌ల్లో నిలిచింది. లిప్ లాక్ స‌న్నివేశాల‌తో పాటు బీచ్ లో బికినీ ధ‌రించి అందాల విందు చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

గ‌త కొంత కాలంగా గ్లామ‌ర్ షో విష‌యంలో హ‌ద్దుల్లో వున్న దీపిక `గెహ్ర‌యాన్‌` తో ఆ హ‌ద్దుల్ని చెరిపేసి హాట్ ట్రీట్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టింది.

ఈ మూవీ ప్ర‌చారం కోసం ఇటీవ‌ల ఫిల్మ్ ఫేర్ మ్యాగ్జిన్ కోసం అన‌న్య పాండేతో క‌లిసి అజంతా ఎల్లోరా శిల్పంలా హోయ‌లు పోతూ అందాల‌ విందు చేసింది. ఎల్లో బికినీ ధ‌రించి థండ‌ర్ థై షో చేస్తూ దీపిక చేసిన ర‌చ్చ‌కు కుర్ర‌కారంతా త‌మ‌ని తాము మైమ‌రిచిపోయి ఊహాలోకాల్లో విహ‌రిస్తున్నారు. మునుపెన్న‌డూ లేని విధింగా దీపిక హాట్ షో తో ర‌చ్చ చేస్తుండ‌టం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

చిట్టి పొట్టి దుస్తుల్లో .. టూ పీస్ బికినీ ధ‌రించి క‌వ్విస్తున్న దీప‌క పోజులు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారుతున్నాయి. `గెహ్ర‌యాన్` త‌రువాత నిత్యం నెట్టింట హాట్ ఫొటోల‌తో అభిమానుల‌కు కల‌ర్ ఫుల్ ట్రీట్ ఇస్తున్న దీపిక తాజాగా ఓ ప్రైవేట్ పార్టీలో హాట్ హాట్ అందాల‌తో క‌నువిందు చేస్తున్న స్టిల్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది ఎల్లో క‌ల‌ర్ డ్రెస్ లో ఎద అందాల‌ని చూపిస్తూ క‌న్ను గీటి టెమ్ట్ చేస్తూ వ‌ల విసురుతున్న‌ దీపిక స్టిల్ నెటిజ‌న్ ల‌ని హీటెక్కిస్తోంది.

విక్ట‌రీ సింబ‌ల్ ని చూపిస్తూ దీపిక చేస్తున్న హంగామా, త‌న డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులతో పాటు నెటిజ‌న్ ల‌ని ఆక‌ట్టుకుంటోంది. ఉన్న‌ట్టుండి పెళ్లి త‌రువాత దీపిక ఇలా హాట్ గా మారిపోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇదిలా వుంటే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న `ప్రాజెక్ట్ కె` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై సి. అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ నేప‌థ్యంలో రూపొంద‌నుంద‌ని, హిమాల‌యాల్లోని ఓ సీక్రెట్ గుహ నేప‌థ్యంలో సాగుతుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు విపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా అమితాబ్ బ‌చ్చ‌న్ పై కీల‌క ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్నారు.